deepthimanne_official (Source: Instagram)
TV Actress Deepthi Manne Boyfriend: దీప్తి మన్నే.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ నటి అయిన ఆమె జీ తెలుగు, స్టార్ మా సీరియల్స్‌తో తెలుగులోనూ మంచి గుర్తింపు పొందింది.
deepthimanne_official (Source: Instagram)
ముఖ్యంగా రాధమ్మ కూతురు సీరియల్‌తో బుల్లితెర ఆడియన్స్‌కి దగ్గరైంది. ప్రస్తుతం జగద్ధాత్రి సీరియల్లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న దీప్తి మన్నే ఇటీవల తాను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
deepthimanne_official (Source: Instagram)
అవును.. ప్రేమలో ఉన్నానంటూ ప్రియుడితో దిగిన ఫోటోలు షేర్ చేసింది. అయితే ఇందులో ప్రియుడిని మాత్రం చూపించలేదు. అంతేకాదు అతడేవరనేది కూడా చెప్పలేదు.
deepthimanne_official (Source: Instagram)
దీంతో దీప్తి లవ్ చేస్తున్న వ్యక్తి ఎవరు? ఇండస్ట్రీకి చెందినవాడేనా? అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కానీ, అతడేవరనేది మాత్రం బయటకు రాలేదు.
deepthimanne_official (Source: Instagram)
కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తే అంటుంటే.. మరికొందరు మాత్రం బయట వ్యక్తి అని చెబుతున్నారు. ఈ క్రమంలో దీప్తి బాయ్‌ఫ్రెండ్ ఎవరనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
deepthimanne_official (Source: Instagram)
ఈ క్రమంలో స్వయంగా దీప్తినే తన బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసింది. తాజాగా అతడితో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రియుడి పేరుతో పాటు ఫేస్ కూడా రివీల్ చేసింది.
deepthimanne_official (Source: Instagram)
అంతేకాకు ఈ సందర్భంగా తన కాబోయేవాడికి ప్రేమలేఖ కూడా రాసింది. తన ప్రియుడితో దిగిన రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసి సస్పెన్స్‌కి తెరలేపింది. తన ప్రియుడి పేరు రోహన్ అని చెప్పింది.
deepthimanne_official (Source: Instagram)
డియర్ రోహన్.. నేను ఇంతకాలం ఎదురుచూస్తున్న వ్యక్తి నువ్వే. ఆ స్వర్గం నాకు పంపిన అపురూపమైన బహుమతి నువ్వు.
deepthimanne_official (Source: Instagram)
నీ పార్ట్నర్గా నన్ను ఎంచుకున్నందుకు థ్యాంక్యూ. ఐ లవ్ యూ అంటూ రాసుకొచ్చింది. దీప్తి ప్రియుడి ఎవరో అంత ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అవుతున్నారు. క్యూట్ కపుల్ అంటూ ఆమె పోస్ట్‌కి కామెంట్స్ చేస్తున్నారు.
deepthimanne_official (Source: Instagram)
ప్రియుడిని పరిచయం చేయడంతో ఆమెకు ఫ్యాన్స్, ఇండస్ట్రీ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే ప్రియుడిని పరిచయం చేసింది కానీ, పెళ్లి ఎప్పుడనేది మాత్రం ఆమె చెప్పలేదు.
deepthimanne_official (Source: Instagram)
దీంతో పెళ్లి ఎప్పుడా? అని అంత ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఏడాది చివవరిలో లేద వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి పీటలు ఎక్కుతారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.