Hyderabad Crime: హైదరాబాద్ సిటీలో దారుణమైన ఘటన జరిగింది. బాలానగర్ ఏరియాలో ఇద్దరు చిన్నారులను చంపింది కన్నతల్లి. ఆ తర్వాత తాను బిల్డిండ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగింది? మహిళ భవనం పైనుంచి దూకిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్ సిటీలోని బాలానగర్ పద్మారావునగర్ ఏరియాలో ఘోరం జరిగింది. ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆపై తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు చిన్నారులు కలవలు. ఒకరు కార్తీకేయ కాగా, మరొకరు లాస్యత వల్లిగా గుర్తించారు. వీరి వయస్సు సుమారు రెండేళ్లు. చిన్నారుల తల్లి సాయిలక్ష్మిగా నిర్థారించారు పోలీసులు. కుటుంబ కలహాలు ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కొన్నాళ్లుగా బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో నివాసం ఉంటున్నారు సాయిలక్ష్మీ-అనిల్ కుమార్ దంపతులు. నాలుగేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. అనిల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల కిందట ఈ దంపతులకు ట్విన్స్ ఉంటారు. తొలుత ఇంట్లో బాగానే జరిగేది. కొడుకు కార్తికేయకు మాటలు రాలేదు. బాబుకి స్పీచ్ థెరపీ చేయిస్తున్నారు. పాపకు తరుచూ జ్వరం వచ్చేది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది.
పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య
రాత్రి భర్త లేని సమయంలో సాయిలక్ష్మి ఇద్దరిని చంపి, తను ఆత్మహత్య చేసుకుంది. PMR అపార్ట్మెంట్ లోని మూడో అంతస్థులో మూడేళ్ల నుంచి నివాసముంటున్నార అనిల్- సాయిలక్ష్మి దంపతులు. వీరి సొంతూరు కృష్ణ జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం భర్త అనిల్ కుమార్‌ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
ఘటన విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తల్లి-ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. పోస్టుమార్టం కోసం వారి డెడ్ బాడీలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో భర్త అనిల్ కుమార్ ఇంట్లో లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ALSO READ: బైక్‌పై రైల్వేగేటు దాటుతూ కిందపడ్డారు.. ఆ తర్వాత దూసుకొచ్చిన రైలు
బాలానగర్ పోలీస్ స్టేషన్ లో దారుణం
ఇద్దరు పిల్లలను చంపి బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి చల్లారి సాయిలక్ష్మీ (27)
రెండు సంవత్సరాల కవలపిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి
బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్ 1 లో నివాసం ఉంటున్న సాయి లక్ష్మీ,అనిల్ కుమార్ దంపతులు
కుటుంబ… pic.twitter.com/JtbtnqwhhM
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025