BigTV English

Illu Illalu Pillalu Today Episode: వల్లికి కడుపు మంట.. భాగ్యం మాస్టర్ ప్లాన్.. ప్రేమ, ధీరజ్ ఒక్కటవుతారా..?

Illu Illalu Pillalu Today Episode: వల్లికి కడుపు మంట.. భాగ్యం మాస్టర్ ప్లాన్.. ప్రేమ, ధీరజ్ ఒక్కటవుతారా..?

Illu Illalu Pillalu Today Episode October 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మద కలెక్టర్ ని పలకరిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేసే అవార్డు తీసుకునింది మీరే కదా అని కలెక్టర్ అడుగుతాడు. అవార్డు మాత్రమే కాదు సార్ నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. అని నర్మదా అనగానే ఆయన వెరీ గుడ్ అమ్మ నువ్వు ఇలానే పని చేసుకుంటూ వెళ్లి మంచి అవార్డులను తీసుకోవాలి అని కోరుకుంటున్నా అని కలెక్టర్ అంటాడు. కలెక్టర్ తో నర్మద మాట్లాడడం చూసిన రామరాజు షాక్ అయిపోతాడు. ఇక నర్మదా మీరు ఏమనుకోనంటే మా కుటుంబాన్ని పరిచయం చేస్తాను అని అంటుంది. రామరాజుని కలెక్టర్ కి పరిచయం చేస్తుంది. కొద్ది నిమిషాల ముందు నా పరువును తీస్తున్నారు అన్న మాటలని రామరాజు జీర్ణించుకోలేకపోతాడు.


మొత్తానికి నర్మదా కలెక్టర్ తో మాట్లాడిన విషయంపై రామరాజు సంతోషంగా ఉంటాడు.. రామరాజు గురించి తన కోడలు గొప్పగా పరిచయం చేస్తుంది. కలెక్టరే తన కోడలితో మాట్లాడం చూసినా ఊరు వాళ్ళందరూ కూడా రామరాజు పై ప్రశంసలు కురిపిస్తారు. ప్రేమ చిన్నపిల్లను కాపాడినందుకు కలెక్టర్ మెచ్చుకుంటారు మొత్తానికి ఇద్దరు కోడలు మంచి పని చేశారంటూ ఆయన మెచ్చుకోవడంతో రామరాజు సంతోష పడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తన ఇద్దరు కోడళ్ళు కూడా మంచి పని చేశారంటూ రామరాజు లోలోపల సంతోష పడతారు. ఊర్లోని వాళ్ళందరూ రామరాజు దగ్గరికి వచ్చి మంచి కోడల్ని తెచ్చుకున్నావు నువ్వు మంచోడివి అంటూ అనడంతో అందరూ కూడా సంతోషంతో మునిగిపోతారు. శ్రీవల్లి వీళ్ళందర్నీ చూసి షాక్ అవుతుంది. ఇందాకే మావయ్య గారు వాళ్ళిద్దర్నీ నా ఇంటి పరువును తీస్తున్నారు అన్నారు. అప్పుడే కలెక్టర్ వచ్చి ఈవిడని మెచ్చుకోగానే అంత మర్చిపోయి ఉంటారు అని తనలో తానే కుళ్ళుకుంటుంది.. వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి. నేనే గ్రేట్ అని అనిపించుకోవాలి.


ఏదో ఒకటి చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు అంటూ శ్రీవల్లి సీరియస్ గా ఉంటుంది. అయితే రామరాజు సంతోష పడుతూ ఉండడం చూసిన వేదవతి కోడళ్ల పై కోపం పోయినట్లు ఉంది. అర్థం కారు గాని ఈయన మనసులో కూడా కోడళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో అనేసి వేదవతి అనుకుంటుంది. రామరాజు దగ్గరికి వెళ్లిన వేదవతి ఇందాక మీరు ఎన్ని మాటలు అన్నారు ఇప్పుడు చూశారా? అంత పెద్ద కలెక్టరే వచ్చి మన కోడల్ని ఎంతగా పొగిడారో.. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి సుమీ కోడల్ని కంట్రోల్లో పెట్టలేదని నన్ను అడగడం కాదు.. కోడలు చేస్తున్న మంచి పనులు కూడా మీరు చూసి నేర్చుకోవాలి అని అంటుంది.

రామరాజు ఆ సేన వల్ల నా కోడలు చేసింది తప్పు అని అపార్థం చేసుకున్నాను. కలెక్టరే వచ్చి నా కోడల్ని మెచ్చుకోవడంతో నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ అంటూ రామరాజు అంటారు. నర్మదా ప్రేమ ఒంటరిగా మురిసిపోతూ ఉండడం చూసి అక్కడికి వెళ్తుంది. నీ ప్రేమ విహారం ఇప్పట్లో బయటపడేలా లేదు కానీ.. ఇప్పుడు వీరవనితవి కదా నువ్వు చేసిన పనికి అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు వెళ్లి ప్రపోజ్ చేయడం కాదు.. ధీరజ్ నీకోసం చేతిలో ఫ్లవర్ పట్టుకొని ప్రపోజ్ చేయడానికి వస్తాడు అటు చూడు అనేసి అంటుంది.

ఎదురుగా ధీరజ్ రావడం చూసిన ప్రేమ నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు అక్క షివరింగ్ వస్తుంది. ఏం చెయ్యాలి అని అడుగుతుంది. దానికి నర్మద అది బటర్ఫ్లై అంటుంది. సీతాకోక లాగా గాల్లో తేలినట్టు అనిపిస్తుంది కదూ అనేసి నర్మదా అంటుంది. ఏమో ఊహించినట్టుగానే ధీరజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు.. మొత్తానికి చూస్తుంటే వీళ్ళిద్దరూ మధ్య ప్రేమ చిగిరించినట్లు కనిపిస్తుంది. శ్రీవల్లి మాత్రం ఇద్దరి కోడల్ని ఎలా దెబ్బ కొట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అమూల్యను బుట్టలో వేసేందుకు విశ్వం మరో ప్లాన్ వేస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు చూడాలి..

మా మామయ్య 20 మందికి పని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు అని నర్మద చెప్పిన మాటను తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇక తర్వాత కలెక్టర్ ఎస్సై గారు గుడిలో ఎవరో చిన్న పాప తప్పిపోయిందని అనౌన్స్ చేశారు కదా ఆ పాప దొరికిందా అని అడుగుతాడు. అవును సార్ దొరికింది కానీ మేము వెతకలేదు ఒక అమ్మాయి తెలివిగా వెతికి ఆ పాపని తన తల్లిదండ్రుల వద్దకు చేర్చింది అని అంటారు. అవునా ఎవరు అమ్మాయి అని అనగానే ప్రేమ ధీరజ్ చిన్న పాపను తీసుకుని అక్కడికి వస్తారు. ఈ అమ్మాయి చాలా తెలివిగా అమ్మాయికి ఇష్టమైన పాటను పాడుతూ తన తల్లిదండ్రుల దగ్గరికి పాపని చేర్చింది అని పోలీసులు అనగానే కలెక్టర్ ప్రశంసలు కురిపిస్తాడు.

పక్కనే ఉన్న నర్మదా ఈమె నా తోడికోడలు సార్ అని అంటుంది. రామరాజు గారు మీ ఇద్దరు కోడలు మీ గౌరవాన్ని పెంచుతున్నారండి ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు అని అనగానే రామరాజు సంతోష పడతాడు. కలెక్టర్ వెళ్ళగానే వేదవతి తన ఇద్దరు కోడల్ని తీసుకొని నా ముద్దుల కోడళ్లు అంటూ మురిసిపోతుంది.. ఇక శ్రీవల్లి తన తల్లిని దలుచుకొని నాకు వీళ్ళని చూస్తుంటే కుల్లేస్తుంది అంటూ అరుస్తుంది.. గుడి బయట వెతుకుతూ ఉండగా భాగ్యం ఆనందరావు బజ్జీలు అమ్మడం చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది.

మీరు ఇక్కడ బజ్జీలు అమ్మడం మా మామయ్య గారు చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది. ఆల్రెడీ మీ మామయ్య గారు చూడడం అయిపోయింది మేము చెప్పడం అయిపోయింది అంత జరిగిపోయింది నువ్వేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని భాగ్యం ఓదారుస్తుంది. ఆ ఇద్దరి కోడళ్ళ వల్ల ఈరోజు మా మామయ్య చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ గౌరవాన్ని పెంచుతున్నారు అని అనగానే మామయ్య ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని దెబ్బ కొట్టాలి అని శ్రీవల్లి అంటుంది.

Also Read: కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. మారిపోయిన అక్షయ్.. అవనికి మైండ్ బ్లాక్..

ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండడం చూసిన నర్మదా ప్రేమ దగ్గరికి వచ్చి నువ్వు గ్రేట్ లేడీ అది ఇది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతుంది. నీ తెలివికి ఊరందరు నీకు సన్మానం చేయాలని అనుకుంటున్నారు. ఏంటక్కా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావ్ చిన్న పాప తప్పిపోతే అలా చేయడం తప్ప అని అడుగుతుంది. నువ్వు ధీరజ్ కి నీ ప్రేమ విషయం చెప్పడం తప్ప అన్ని మంచి పనులే చేస్తున్నావని నర్మదా అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ధీరజే నీకోసం వస్తున్నాడు చూడు అని అంటుంది. ధీరజ్ నిజంగానే చేతిలో కవర్ పట్టుకొని రావడం చూసిన ప్రేమ సంతోషపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Nindu Noorella Saavasam Serial Today october 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  చంభా, ఘోరాకు షాక్‌ ఇచ్చిన అంజు

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. మారిపోయిన అక్షయ్.. అవనికి మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రుద్రాణి ప్లాన్‌ సక్సెస్‌ – గంగలో కలిసిపోయిన దుగ్గిరాల పరువు

GudiGantalu Today episode: మీనా పై ప్రభావతి సీరియస్.. శిష్యులుగా చేరిన మీనా, బాలు.. ప్రభావతికి నొప్పుల బాధ..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

Gundeninda Gudigantalu Kamakshi : ‘గుండెనిండా గుడిగంటలు’ కామాక్షి రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. 12 ఏట పెళ్లి..

Varshini Suresh: పాపం.. మెంటల్ ప్రెషర్ వల్ల సీరియల్ నటికి ఫిట్స్.. సీరియల్స్ లో అలా చేసినందుకే!

Big Stories

×