Intinti Ramayanam Today Episode October 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం చెప్పిన మాట వినకుండా నువ్వు చేసింది తప్పే అని అంటాడు.. నిన్ను నా కూతురు కన్నా ఎక్కువగా నమ్మాను. కానీ నువ్వు చేసింది ఏంటి అని అంటుంది. నువ్విలాంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నా చేతే అవని ఇంట్లోంచి బయటికి గెంటిస్తావా? లేనిపోనివి చెప్పి నన్ను నీమీద తప్పుడు అభిప్రాయం వచ్చేలా చేసింది. పల్లవిని అసలు నిజం అని బయటపెడుతుంది పార్వతి.. ఇక అక్షయ్ కూడా నీవల్ల నా భార్యను ఎంతో అపార్థం చేసుకున్నాను అని అంటాడు. పల్లవి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ కమల్ బయటికి గెంటేస్తాడు. మీరు నన్ను గెంటేసేదేంటి నేను ఇక నుంచి వెళ్ళిపోతాను అని పల్లవి వెళ్ళిపోతుంది. అక్షయ్ అవనీల మధ్య దూరం తగ్గిపోతుంది. పల్లవి వాళ్ళని ఏదో ఒకటి చేసేంతవరకు నేను నిద్ర పోను అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మొత్తానికి పల్లవి వెళ్లిపోవడంతో అక్షయ్ అవనీల మధ్య ఉన్న దూరం కూడా దూరం అవుతుంది. ఇద్దరు కలిసిపోతారు. కమల్ పల్లవి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతూ తన వస్తువులన్నిటిని కూడా తగలబెట్టాలని ఒకచోట వేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అవని కమల్ ని అడ్డుకుంటుంది. నాకు చాలా బాధగా ఉంది వదిన నీ జీవితం ఇలా మారిపోవడానికి కారణం పల్లవిని అని తెలిసి నేను సహించలేకపోతున్నాను. భార్య నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా భార్య చేసినదానికి నన్ను క్షమించు వదిన అని అవని కాళ్లు పట్టుకుంటాడు కమల్..
పల్లవి చేసిన తప్పులను నీకు చెప్పి పల్లవిని బ్యాడ్ చేయడం నా ఉద్దేశం కాదు.. పల్లవి వల్ల నువ్వు ఏమైపోతావో అని నేను చాలా బాధపడ్డాను అని అవని అంటుంది. నాకోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావా వదిన. నువ్వు అన్నయ్య బయటికి వెళ్లి ఎన్ని కష్టాలు పడ్డారో నేను కళ్ళారా చూశాను కదా అని కమల్ ఎమోషనల్ అవుతాడు.. ఇప్పుడు ఏదో జరిగిపోయింది కదా ఇంక వదిలేసేయ్ అని అవని అంటుంది. నిన్ను ఎప్పుడూ నా మరిదిగా చూడలేదు నా బిడ్డగా చూశాను అమ్మ నువ్వు ఏడుస్తూ ఉంటే చూడలేదు కదా నువ్వు ఏడవద్దు కన్నయ్య అని అవని ఓదారుస్తుంది.
పల్లవి ఆ ఇంటిని ఎలాగైనా సరే నాశనం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. వ్యక్తితో కలిసి తన ప్లాన్ ని మొదలు పెడుతుంది. ఎలాగైనా సరే ఆ ఇంట్లో వాళ్ళని నాశనం చేయాలి అని పల్లవి అనుకుంటుంది. అవని వంట చేస్తుంటే అక్షయ్ అక్కడికి వెళ్లి రొమాంటిక్గా మాట్లాడుతాడు.. నువ్వేం చేసినా నాకు బాగానే ఉంటుంది అంటూ అక్షయ్ మాట్లాడటం అవన్నీ సిగ్గు పడడం చూసి అందరూ మురిసిపోతూ ఉంటారు.
Also Read : మీనా పై ప్రభావతి సీరియస్.. శిష్యులుగా చేరిన మీనా, బాలు.. ప్రభావతికి నొప్పుల బాధ..
కమల్ కేకు తెచ్చి అన్నయ్య వదిన మీరు ఈ కేకును కట్ చేయాలి మీరిద్దరూ కలిసిపోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. వీళ్ళందరూ కేకు కట్ చేయమని బలవంతం చేయడంతో వాళ్ళిద్దరూ కేక్ కట్ చేస్తారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తారు అవనీ అతని లోపలికి రమ్మని పిలుస్తుంది. మీరు 50 లక్షలు కోసం ఈ ఇంటిని నా పేరు మీద రాశారు మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను.. ఇంటిని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని అంటాడు.. నేను కోట్లు విలువ చేసే ఇంటిని 50 లక్షలు కోసం నీకెందుకు రాసిస్తాను అని అవని అంటుంది. ఆ కాగితలో అలానే రాసి ఉంది కదా మరి మీరు కచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అని అంటాడు.. అవని నేను నిజంగా అప్పుడు చేసినప్పుడు వేరేలా ఉంది మామయ్య ఇప్పుడు వేరేలా ఉంది అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..