BigTV English

Most Secure Smartphones: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Most Secure Smartphones: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Most Secure Smartphones| స్మార్ట్ ఫోన్ అంటే కేవలం దూర సంభాషణలు జరిపే పరికరం మాత్రమే కాదు.. అరచేతిలో ఒక మినీ కంప్యూటర్ లాంటిది. అందులో వ్యక్తిగత, ఆర్థిక డేటా ఉంటుంది. ఈ కారణంగా స్మార్ట్‌ఫోన్ల సెక్యూరిటీ చాలా ముఖ్యమైన అంశం. కానీ ఇటీవలి కాలంలో ఫోన్లు, కంప్యూటర్ల హ్యాకింగ్ కు గురువుతున్నాయి. అందులోని డేటాని సైబర్ మోసగాళ్లు దోచుకొని తద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారం, బ్యాకింగ్ డేటా లాంటి రహస్య సమాచారం ద్వారా బ్యాంకు అకౌంట్లు కొల్లగొడుతున్నారు.


ఈ కారణంగానే స్మార్ట్ ఫోన్ల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ప్రపంచంలో ఆపిల్ కంపెనీ తయారు చేసిన ఐఫోన్ల భద్రత విషయంలో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఐఫోన్లతో పాటు మరికొన్ని బ్రాండ్లు కూడా సెక్యూరిటీకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. ఇవి డేటాను సురక్షితంగా ఉంచే అత్యుత్తమ టెక్నాలజీతో రూపొందాయి. ఈ సెక్యూరిటీ మీ డేటాను రక్షిస్తుంది. ప్రపంచంలో అయిదు అత్యంత సురక్షిత ఫోన్లు ఇవే..

1. బ్లాక్‌ఫోన్ 2

ఈ ఫోన్ ప్రైవసీ-ఫోకస్డ్ సైలెంట్ ఓఎస్‌పై నడుస్తుంది. బ్లాక్‌ఫోన్ 2.. కాల్స్, మెసేజ్‌లు, డేటా ట్రాన్స్‌ఫర్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఇస్తుంది. అన్ని కమ్యూనికేషన్స్ పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా టాప్ జర్నలిస్ట్‌లు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్ కు బ్లాక్‌ ఫోన్‌ టాప్ ఛాయిస్. డిజిటల్ సెక్యూరిటీకి ఇది మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఫోన్ ట్రాకింగ్‌ను బ్లాక్ చేస్తుంది, సురక్షిత యాప్‌లను మాత్రమే అనుమతిస్తుంది.


2. ప్యూరిజం లిబ్రెమ్ 5

లిబ్రెమ్ 5 లినక్స్ ఆధారిత ప్యూర్‌ ఓఎస్‌ పై రన్ అవుతుంది. ఇందులో ఫిజికల్ హార్డ్‌వేర్ కిల్ స్విచ్‌లు ఉన్నాయి. కెమెరా, మైక్రోఫోన్‌ను పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. వై-ఫై, బ్లూటూత్‌ను కూడా స్విచ్‌తో డిజేబుల్ చేయవచ్చు. యాక్టివిస్ట్‌లు, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు దీన్ని ఇష్టపడతారు. ఓపెన్-సోర్స్ కోడ్‌ ఆధారంగా దీని పనితీరు పారదర్శకంగా ఉంటుంది. అయితే, ఈ ఫోన్‌లో అనుమతించబడిన యాప్‌ల సంఖ్య తక్కువ.

3. బిట్టియం టఫ్ మొబైల్ 2C

ఇది మిలిటరీ-గ్రేడ్ సురక్షిత స్మార్ట్‌ఫోన్. ఇందులో డ్యూయల్ ఓఎస్ (ఆండ్రాయిడ్, సెక్యూర్ ఓఎస్) ఉంది. హార్డ్‌వేర్ ఆధారిత ఎన్‌క్రిప్షన్ డేటాను రక్షిస్తుంది. ఈ ఫోన్ చాలా డ్యూరబుల్, బలంగా ఉంటుంది. డిఫెన్స్ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు దీన్ని ఉపయోగిస్తాయి. ఇది ట్యాంపరింగ్‌ను నిరోధిస్తుంది. అయితే, ఇది ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

4. యాపిల్ ఐఫోన్ 17 ప్రో/ప్రో మాక్స్

యాపిల్ ఎల్లప్పుడూ సెక్యూరిటీ, ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తుంది. ఈ ఫోన్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. ఫేస్ ఐడీ, సెక్యూర్ ఎన్‌క్లేవ్ చిప్ సురక్షితంగా ఉంచుతాయి. ఐఓఎస్ క్లోజ్డ్ ఎకోసిస్టమ్ భద్రతను పెంచుతుంది. ప్రైవసీ-ఫోకస్డ్ ఫీచర్లు సిస్టమ్‌లో బిల్ట్-ఇన్‌గా ఉన్నాయి. యూజర్లు ఈ ఫోన్ సులభంగా ఉపయోగించగలరు. ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది.

5. శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా

ఈ శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.. నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ హార్డ్‌వేర్ స్థాయిలో డేటాను రక్షిస్తుంది. సెక్యూర్ ఫోల్డర్, బయోమెట్రిక్ లాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఓస్ తో రన్ ఈ శామ్‌సంగ ఫోన్ అత్యంత బలమైన ప్రైవసీ సెట్టింగ్‌లను అందించడంలో ప్రత్యేకం. ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలకు చెందిన అధికారులు ఈ ఫోన్ ని చాలా నమ్మకంగా వినియోగిస్తారు. పనితీరు అద్భుతం, కానీ కొన్ని యాప్‌లు.. గూగుల్‌తో ఓవర్‌ల్యాప్ అవుతాయి.

ఈ ఫోన్‌లే ఎందుకు ఎంచుకోవాలి?

ఈ ఫోన్‌లు సెక్యూరిటీలో అగ్రస్థానంలో ఉన్నాయి. హ్యాకింగ్‌ను నిరోధిస్తాయి. మీ అవసరాల ఆధారంగా ఎంచుకోండి. ప్రైవసీ ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఈ ఫోన్‌లు డేటా దొంగతనాన్ని అడ్డుకుంటాయి. ఎంచుకునే ముందు బడ్జెట్, ఫీచర్లను పూర్తిగా తెలుసుకోండి.

Also Read:  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే

Related News

Samsung W26 Foldable: ఫోల్డెబుల్ ఫోన్‌లో 200MP కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ… శామ్‌సంగ్ W26 ఫోల్డ్ లాంచ్

Storing Paswords: బ్రౌజర్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్ చేస్తున్నారా? ఈ ప్రమాదాల గురించి తెలుసుకోండి

Amazon Alexa Offers: అలెక్సా డివైజ్‌లపై 50 శాతం తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి

Motorola Moto G85 5G: ఒక్క ఫోన్‌లో అన్ని ఫీచర్లు.. 7800mAh బ్యాటరీతో మోటోరోలా G85 5G పోన్ లాంచ్

Smartphone Comparison: మోటో G06 పవర్ vs గెలాక్సీ M07.. ₹8,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Samsung Galaxy Ultra Neo: ఓ మై గాడ్! 9వేలకే శామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా నీవో..! ఇంత చీప్ ధరలో 5జి ఫోన్!

Mappls Google Maps: గూగుల్ మ్యాప్స్‌కు మించిపోయే ఇండియన్ యాప్.. 3D నావిగేషన్‌తో కొత్త మ్యాప్‌ల్స్

Big Stories

×