IND vs WI: ఢిల్లీ వేదికగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. మరో 58 పరుగులు చేస్తే గ్రాండ్ విక్టరీ కొట్టడం ఖాయం. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ కు తీవ్ర గాయం అయింది. వెస్టిండీస్ బౌలర్ వేసిన బంతి తగలరాని చోట తగిలింది. దీంతో అక్కడే కుప్పకూలాడు కేఎల్ రాహుల్. ఈ సంఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ కు తీవ్రమైన గాయమైంది. నిన్న సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి తగలరాని చోట తగిలింది. వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ ( Jayden Seales ) వేసిన ఓ అద్భుతమైన బంతి… కేఎల్ రాహుల్ ప్రైవేట్ పార్ట్స్ పై తాకింది. దీంతో అక్కడే కుప్పకూలాడు కేఎల్ రాహుల్. అనంతరం దాదాపు పది అడుగుల వరకు పరిగెత్తి అక్కడే కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి, కేఎల్ రాహుల్ కు ప్రథమ చికిత్స అందించారు. దాదాపు 15 నిమిషాల తర్వాత కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. ఈ సంఘటన కేఎల్ రాహుల్ 5 పరుగల వద్ద ఉన్నప్పుడు చోటు చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేశాడు.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
KL Rahul Is In A Lot Of Pain The Ball Hit Him Hard And He’s On The Ground Hope He’s Fine 🥲pic.twitter.com/1e9ByjU2xn
— 𝐀•ᴷᴸ ᴿᵃʰᵘˡ ˢᵗᵃⁿ (@123Centurion__) October 13, 2025