Nindu Noorella Saavasam Serial Today Episode: ఎవ్వరూ చూడకుండా ఆరు రూంలోకి వెళ్లి ఆస్తికలు తీసుకుని వెళ్తున్న మంగళను చూసిన ఆరు మా పిన్నిని ఆపండి గుప్తగారు.. అని చెప్తుంది. దీంతో నేను ఆవిడను ఆపలేను బాలిక ఆశక్తుడని అని చెప్తాడు. అయితే ఆవిడ ఆస్తికలు తీసుకెళ్లి ఏం చేస్తారు.. ఎవరికి ఇస్తుంది గుప్తగారు పదండి తను వెళ్లిపోతుంది అని మంగళ వెనక ఫాలో అవుతారు గుప్త, ఆరు. మంగళ నేరుగా చంభా, ఘోర దగ్గరకు వెళ్లి బంగారు గాజులు తీసుకుని అస్తికలు చంభాకు ఇస్తుంది. అది చూసిన ఆరు కంగారుగా గుప్త గారు మా పిన్ని ఏంటి నా ఆస్థికలు వాళ్లకు ఇస్తుంది అని అడగ్గానే.. నిలువెళ్లా స్వార్థమును విషమును నింపుకున్న నీచపు మనిషి బాలిక. నగల కొరకు నిన్నే బలి చేయుచున్నది అని గుప్త చెప్పగానే..
సొంత పిన్ని అయ్యుండి ఇలా చేస్తున్నారేంటి… ఇప్పుడు నా అస్తికలతో వాళ్లు ఏం చేస్తారు గుప్త గారు.. అని అడుగుతుంది. దీంతో గుప్త నిన్ను బంధించి వారి వశము చేసుకొనెదరు నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలగదు.. మరు జన్మ సంప్రాప్తించదు.. అని చెప్పగానే.. ఆరు కంగారుగా అంటే నేను మళ్లీ నా చెల్లికి కూతురుగా పుట్టనా గుప్త గారు అని అడుగుతుంది. దీంతో నీ అస్థికలను గంగలో నిమజ్జనం చేయకుంటే.. నీవు మరలా జన్మించుట అసాధ్యము బాలిక. రేపు జరగబోవు నీ కార్యము మొదలగు లోపు నీ అస్థికలు తిరిగి రానిచో.. నువ్వు శాశ్వతంగా ఆ దుష్ట మాంత్రికులకు బందీవై వాళ్ల చేతుల్లో కీలు బొమ్మవు అయ్యెదవు.. అని హెచ్చరింగానే.. ఆరు ఏడుస్తూ.. అలా జరగకూడదు గుప్త గారు ఏదో ఒకటి చేయండి.. ఎలాగైనా నా అస్తికలను వెనక్కి తెప్పించండి ఫ్లీజ్.. నేను మళ్లీ నా చెల్లెలికి పుట్టాలి. నాకు మరో జన్మ కావాలి. ఏదో ఒకటి చెయ్యండి గుప్త గారు ఫ్లీజ్ అని వేడుకుంటుంది ఆరు. ఇంతలో చంబా, ఘోర అస్థికలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తర్వాత అమర్ వాళ్లు అందరూ నది దగ్గరకు వెళ్లి ఆరు ఆస్థికలు నిమజ్జనం చేయడానికి పూజ చేస్తుంటారు. పూజ చేస్తున్న అమర్ తనకు ఆరుతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసకుంటూ ఎమోషనల్ అవుతాడు. పిల్లలు కూడా తమకు ఆరుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. మిస్సమ్మ కూడా తాను ఆరుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. ఇంతలో రామ్మూర్తి అటూ ఇటూ చూసి అమ్మ భాగీ అక్క ఇక్కడికి వచ్చిందా అమ్మా అని అడుగుతాడు. మిస్సమ్మ అటూ ఇటూ చూసి లేదు నాన్న అక్క ఇక్కడ లేదు అని చెప్తుంది. అంటే కార్యం ముగియక ముందే అక్క పైకి వెళ్లిపోయిందా అమ్మా అని రామ్మూర్తి అడుగుతాడు. లేదు నాన్న ఈ ఘడియల్లోనే కార్యం జరగాలని అక్క చెప్పింది. అప్పుడే తాను మళ్లీ పుడుతుందట అని మిస్సమ్మ చెప్పగానే..
అందుకే కదమ్మా అల్లుడు గారి మనసు నొచ్చుకున్నా ఒత్తిడి చేసి కార్యం జరిపిస్తున్నాం.. లేదంటే అక్క ఇంకొన్నాళ్లు మనతో ఉండేది అంటూ రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. దీంతో అదే నేను ఆశపడ్డాను నాన్న.. మీకు కొన్నైనా అక్క తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు అవి కూడా లేవు అంటూ మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. ఇంతలో అస్థికలు నిమజ్జనం చేసే దగ్గరకు చంభా, ఘోర వస్తారు. అప్పుడే అక్కడికి గుప్త, ఆరు కూడా వస్తారు. గుప్త వెంటనే తన ఉంగరం అంజు వేలుకు పడేలా మంత్రం వేస్తాడు. ఆ ఉంగరం తన చేతికి పడగానే.. అంజు నిమజ్జనం దగ్గర నుంచి చంభా వాళ్ల దగ్గరకు వెళ్తుంది. అక్కడ పూజలో ఉన్నవి అస్థికలు కావు.. బూడిద అని చెప్పి కోపంగా చంభా, ఘోరాను కొడుతుంది. వాళ్ల దగ్గర ఉన్న అస్థికలు తీసుకుంటుంది. ఇంతలో అమర్ నదిలోకి వెళ్లి ఆస్థికలు నిమజ్జన చేయబోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.