hebba patel (1)
Hebbah Patel Latest Photos: హెబ్బా పటేల్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె బ్లాక్ అండ్ వైట్ లో ఫోటో షేర్ చేసింది. ఇందులో ఆమె లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. హెబ్బాకి ఏమైంది.. ఇంతలా మారిపోయిందంటున్నారు. కుమారి 21F మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.
hebba patel (2)
ఎంట్రీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఇక హెబ్బా వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ పోయింది. అయితే అన్ని కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం మంచి విజయం సాధించింది.
hebba patel (3)
ఇందులో హెబ్బాకు స్క్రీన్ స్పెస్ తక్కువగా ఉండటంతో ఈ హిట్ హీరో ఖాతాలోకి మాత్రమే వెళ్లింది. ఫలితాలతో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేసిన ఆమె.. ఆ తర్వాత రూటు మార్చింది. స్పెషల్ సాంగ్స్ లో నటించింది. అయినా కూడా ఆమెకు కలిసి రాలేదు. హిట్స్ కోసం బోల్డ్ రోల్స్ కూడా చేసింది.
hebba patel (4)
అవేవి హెబ్బాకు పెద్దగా ప్లస్ కాలేదు. అయినా కూడా అడపదడప సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఆమె అనుకున్న స్థాయిలో హిట్ రాలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తుంది.
hebba patel (5)
అయితే ఎప్పుడు గ్లామరో డోస్ పెంచే హెబ్బా ఈసారి ట్రెడిషనల్ లుక్ ఫోటో షేర్ చేసింది. పంచాబీ డ్రెస్‌లో కూల్ లుక్ లుక్ లో కనిపించింది. అయితే ఇందులో ఆమె చాలా సన్నగా కనిపించింది. మొన్నటి వరకు బోద్దుగా ఉన్న హెబ్బా ఇందులో బక్కపలుచగా కనిపించింది. ముఖంలోనూ గ్లో లేదు. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు.
hebba patel (6)
ఎంటీ హెబ్బా ఇంతలా సన్నబడ్డావు.. బొద్దుగానే బాగున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం క్యూట్, బ్యూటీఫుల్ అంటూ ఆమె లుక్ ని కొనియాడుతున్నారు. ఇటీవల ఒదేల 2లో కనిపించిన హెబ్బా ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.