Srinidhi Shetty Shocking Photos: శ్రీనిధి శెట్టి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది ఒక్క సినిమానే.. ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. కన్నడ బ్యూటీ అయిన ఈమెకు సౌత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ తో వెండితెరకు పరిచయమైన ఆమె.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. కేజీయఫ్ తర్వాత శ్రీనిధి దూకుడు మామూలుగా ఉండదు అనుకున్నారు. కానీ, ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ సాగడం లేదు. కేజీయఫ్ తర్వాత ఆమె పెద్దగా సినిమాలు చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత నాని హిట్ 3 ఆఫర్ కొట్టింది. దీనితోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుసా కదా మూవీతో బిజీ
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీతో బిజీగా ఉంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీనిధి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్తో బిజీగా ఉంది. అయితే ఈ భామ సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపిస్తుంది. కేజీయఫ్ తర్వాత ఎంతో స్టార్ డమ్ అందుకున్న ఆమె కనీసం నెట్టింట అయినా యాక్టివ్గా ఉంటుందని అనుకున్నారు. కానీ అప్పుడప్పుడ మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎప్పడో ఒకసారి తన ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ మధ్య వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అదే జోష్ ఈ భామ తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తోంది. తన వృత్తి, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.
పిల్లలతో కలిసి..
తాజాగా ఈ భామ షాకింగ్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో నైట్ వేర్ ఇద్దరు పిల్లలతో కనిపించింది. అంతేకాదు బాబును లాలిస్తూ పాలు పట్టింది. ఈ ఫోటోలు చూసి అంత షాక్ అవుతున్నారు. ఏంటీ? శ్రీనిధికి పిల్లలు ఉన్నారా? పెళ్లి ఎప్పుడైందని ఆమె ఫ్యాన్స్ కంగుతింటున్నారు. తన పూర్తి పోస్ట్ చూశాక హమ్మయ్య అనుకుంటున్నారు. ఇంతకి వాళ్లు ఎవరంటే ఆమె సోదరుడి పిల్లలు అని తెలుస్తోంది. ఈ ఫోటోలకు నేను ఉత్తమ అత్తని అని ఖచ్చితంగా చెప్పగలను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇది నేను నిద్ర లేచినప్పుడు. లేచేసరికి నా పిల్లలు ఇలా నా పక్కనే ఉన్నారు. నాకు తెలుసు. నేను ఉత్తమ అత్తని. ఈ విషయం ఖచ్చితంగా చెప్పగలను‘ అంటూ తన పోస్ట్ కి రాసుకొచ్చింది.
ఆ ఘనత కీరిటం గెలిచిన రెండో భారతీయురాలు
కాగా కన్నడ బ్యూటీ అయిన శ్రీనిధి మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ కర్ణాటక కీరిటం గెలుచుకుంది. అలాగే 2016లో మిస్ సుపర్ నేషనల్, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిళ్లను గెలుచుకుంది. 2016లో ఇండియా తరపు ప్రాతినిధ్యం వహించిన మిస్ సుప్రనేషన్ కీరిటం గెలిచిన రెండవ భారతీయురాలిగా ఆమె గుర్తింపు పొందింది. అదే టైంలో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ లో హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. కేజీయఫ్చాప్టర్ వన్, కేజీయఫ్ 2లతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమా పాన్ ఇండియా హిట్స్ అందుకుంది.
Also Read: Prakash Raj: సిగ్గు అనిపించడం లేదా? మరోసారి పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ ఫైర్