BigTV English

OTT Movie: గోవాలో జాంబీల అలజడి.. ఈ హార్రర్ మూవీ చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది, ఫ్యామిలీతో చూడొద్దు

OTT Movie: గోవాలో జాంబీల అలజడి.. ఈ హార్రర్ మూవీ చూస్తే నవ్వి నవ్వి పొట్ట చెక్కలవుతుంది, ఫ్యామిలీతో చూడొద్దు


OTT Movies: మీకు జాంబీ మూవీస్ అంటే ఇష్టమా? అయితే మీరు ఇప్పటివరకు మీరు కొరియా, హాలీవుడ్ జాంబీ మూవీస్ మాత్రమే చూసి ఉంటారు. అయితే, బాలీవుడ్‌లో కూడా ఒక జాంబీ మూవీ వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ మూవీ పేరు ‘గో గోవా గాన్’ (Go Goa Gone). 2013లో విడుదలైన ఆ మూవీ అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. రెగ్యులర్ జాంబీ చిత్రంలా కాకుండా హర్రర్, హ్యూమర్‌తో సాగిపోతుంది ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో కూడా ఉంది. మరి కథలోకి వెళ్లిపోదామా?

కథేంటీ?


హార్దిక్ (కునాల్ ఖేము), లవ్ (వీర్ దాస్) ఇద్దరు స్నేహితులు, ముంబైలో ఒకే ఇంట్లో రూమ్‌మేట్స్‌గా ఉంటారు. వీరికి ఉద్యోగాలు చెయ్యడం ఇష్టం ఉండదు. డ్రగ్స్, పార్టీలకు అలవాటు పడతారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపేయాలని అనుకుంటారు. పనికిమాలిన పనుల వల్ల హార్దిక్ తన ఉద్యోగం కోల్పోతాడు. లవ్‌కు తన ప్రియురాలితో బ్రేకప్ అవుతుంది. దీంతో ఇద్దరూ బాధలో మునిగిపోతారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు తమ స్నేహితుడు బన్నీ (ఆనంద్ తివారీ)ని కలుస్తారు. అతడు ఓ వ్యాపార పర్యటన కోసం గోవాకు వెళ్తున్నాడని తెలుస్తుంది. దీంతో హార్దిక్, లవ్ కూడా బన్నీతో కలిసి గోవా వెళ్తారు. బన్నీతో ఖర్చు పెట్టించాలని అనుకుంటారు.

ఓ అమ్మాయి పరిచయంతో..

లవ్‌కు గోవాలో లూనా (పూజా గుప్తా) అనే అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చాలా ఫాస్ట్. హార్దిక్, లవ్, బన్నీలను ఆమె ఒక రహస్య రేవ్ పార్టీకి ఆహ్వానిస్తుంది. ఒక సీక్రెట్ ఐలాండ్‌లో.. రష్యన్ మాఫియా నాయకుడు బోరిస్ (సైఫ్ అలీ ఖాన్) ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ నడుస్తుంది. ఈ పార్టీలో D2RF అనే డ్రగ్‌ను అమ్ముతారు. దీనిని బోరిస్, అతని సహచరుడు నికోలాయ్ (కాశీ హంటర్) ప్రమోట్ చేస్తారు. అయితే దాని ధర ఎక్కువగా ఉండటం వల్ల హార్దిక్, లవ్, బన్నీ ఆ డ్రగ్ తీసుకోరు. దీంతో మిగతా సభ్యులు తీసుకుంటారు.

తర్వాతి అంతా రచ్చ..

తర్వాతి రోజు ఉదయం ఆ ఐలాండ్‌లో భయంకరమైన ఘటన జరుగుతుంది. D2RF డ్రగ్ తీసుకున్న వారందరూ జాంబీలుగా మారిపోతారు. ఆ ముగ్గురిని ఐలాండ్‌కు తీసుకొచ్చిన లూనా.. తన స్నేహితుడు ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత అనారోగ్యానికి గురై, జాంబీగా మారిపోయి.. దాడి చేస్తున్నాడని చెబుతుంది. ఆ ద్వీపం మొత్తం జాంబీలతో నిండిపోతుంది. హార్దిక్, లవ్, బన్నీ, లూనా వాటి నుంచి తప్పించుకుని బతకడానికి ప్రయత్నిస్తారు. అదే టైమ్‌లో బోరిస్‌ను వారు మళ్లీ కలుస్తారు. అతడికి జాంబీలను చంపడంలో నైపుణ్యం ఉంటుంది. బోరిస్ తన ఆయుధాలతో జాంబీలను చంపేస్తుంటాడు.

విల్లాలో చిక్కుకుని విలవిల

వారంతా అలా జాంబీల నుంచి తప్పించుకుని ఆ దీవిలోనే ఉన్న ఒక విల్లాకు చేరుకుంటారు. ఆ విల్లాను జాంబీలు చుట్టుముట్టేస్తాయి. అక్కడ నుంచి బయట పడటం కష్టమవుతుంది. మరి అక్కడి నుంచి వారు.. తప్పించుకోగలిగారా? ఆ ఐలాండ్‌ను వదిలి.. నగరానికి చేరుకుంటారా? చివరికి ఏమవుతుందో తెలియాలి అంటే తప్పకుండా మూవీని చూడాల్సిందే. ఈ మూవీ Z5 (జీ5) ఓటీటీలో ఉచితంగా ఉంది. హిందీలో స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఫ్యామిలీతో కలిపి చూడకండి. కొన్ని అడల్ట్ సీన్స్, బూతులు ఉంటాయి. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘గో గోవా గాన్ 2’ను 2020లో ప్రకటించారు. కానీ కోవిడ్ వల్ల మూవీని కొనసాగించలేదు. మళ్లీ దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read: Telugu Web Series: ఇండియన్‌ కుర్రాడితో అమెరికా పిల్ల ఆ పని.. గతం మరిచి బీభత్సం, చివర్లో థ్రిల్లింగ్ ట్విస్ట్!

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×