Allu Aravind: టాలీవుడ్ సినీ నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ (Allu Aravind) ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా పక్క హిట్ అవుతుందని సంగతి అందరికీ తెలిసిందే. సినిమాల విషయంలో అల్లు అరవింద్ జడ్జిమెంట్ అంత ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఈయన నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ కూడా పలు సినిమాలను కొనుగోలు చేస్తూ భారీ స్థాయిలో లాభాలను అందుకుంటున్నారు. ఇక అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన సినిమాలలో సరైనోడు(sarrainodu) సినిమా ఒకటి.
బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్ ప్రీతిసింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2016 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అల్లు అరవింద్ సైతం సరైనోడు 2 (sarrainodu 2)గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అల్లు అరవింద్ సమర్పణలో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా నవంబర్ ఏడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ ను సరైనోడు2 గురించి ప్రశ్నిస్తూ.. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ నుంచే రాబోతోందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సరైనోడు 2 గురించేనా అంటూ ప్రశ్నలు ఎదురవడంతో ఈయన ఆసక్తికరమైన సమాధానాలను వెల్లడించారు.
గీతా ఆర్ట్స్ లోనే సరైనోడు 2..
అల్లు అర్జున్ హీరోగా సరైనోడు 2 ఎప్పుడు వచ్చినా అది కచ్చితంగా గీత ఆన్సర్ బ్యానర్ లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలియజేశారు. ఈ సినిమాని ఇతర బ్యానర్లో కాకుండా తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తానని చెప్పిన అల్లు అరవింద్ ఎప్పుడు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సైతం ఇతర సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన అట్లీ డైరెక్షన్లో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం సరైనోడు తీయబోతున్నారా లేదంటే కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ కావడంతో పుష్ప 3 సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.. ఇక ఈ సినిమా కూడా మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
Also Read: Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్.. దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?