jacqueline fernandez: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి చెప్పనక్కర్లేదు.
పద్నాలుగేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన లంక బ్యూటీ వెనుదిరిగి చూడలేదు.
నాలుగు పదుల వయసొచ్చినా ఇంకా 30 ప్లస్ మాదిరిగానే కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఏడాది ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న ఈ బ్యూటీ, వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్‌ని ఫుల్ చేసుకునే పనిలో పడింది.
అన్నట్లు ఆ మధ్య శ్రీలంకలోకి ఓ ఐలాండ్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదు.
ఏమైనా బిజినెస్ ప్రారంభించే పనిలో ఉందా? లేదా అనేది చూడాలి. కొత్త ప్రాజెక్టుల నేపథ్యంలో ఎక్సర్ సైజ్‌లు మొదలు పెట్టేసింది.
ట్రైనర్‌ని దగ్గర పెట్టుకుని స్లిమ్‌గా తయారయ్యే పనిలో బిజీ అయ్యింది.
కాకపోతే ఫేస్‌లో చాలా మార్పులు వచ్చాయని అంటున్నారు. మునుపటి లుక్ ఆమెలో కనిపించలేదని అంటున్నారు.