BigTV English

Women Cheated Man: ఫోటోలో చెల్లి.. చాటింగ్ లో అక్క.. ఏళ్లకు ఏళ్లు సాగిన ప్రేమ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే!

Women Cheated Man: ఫోటోలో చెల్లి.. చాటింగ్ లో అక్క.. ఏళ్లకు ఏళ్లు సాగిన ప్రేమ.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే!

Women Cheated Man: చెల్లెలు ఫోటోతో ఓ అబ్బాయికి పరిచయమైంది ఆ యువతి. అది కూడా సోషల్ మీడియా ద్వారా మాటలు కలిపి, ఏకంగా ఒక కోటి 20 లక్షలు మోసం చేసిందట. చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, వైద్యశాలలో చికిత్స పొందుతోంది ఆ యువతి. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చక్రాల గ్రామానికి చెందిన ఓ యువతి, తెలంగాణ పటాన్ చెరువు మండలం ముత్తంగి కి చెందిన యువకుడికి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. యువకుడు హైదరాబాద్ లోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరి పరిచయం ఏళ్ల తరబడి కొనసాగింది.

అయితే సదరు యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న యువకుడు, పెళ్లి మాట ఎత్తగానే యువతి ఏదో ఒక కారణం చెబుతూ దాటవేసేదట. పలుమార్లు ఆర్థికంగా సహాయపడేందుకు డబ్బులు అందజేసిన యువకుడు, మొత్తం కోటి 20 లక్షలు అందజేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


చివరకు తాను మోసపోయానని గ్రహించిన యువకుడు పెద్దల సమక్షంలో పంచాయతీ చేయగా, రూ.10 లక్షలు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన డబ్బులను యువకుడు పదేపదే అడుగుతుండగా, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో పత్తికొండ పోలీసులను యువకుడు ఆశ్రయించాడు.

Also Read: Game Changer Pre Release Event : కల నెరవేరబోతుంది… డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ఒకే స్టేజ్‌పైకి బాబాయ్ – అబ్బాయ్?

ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. చెల్లెలు ఫోటో సోషల్ మీడియా ముఖచిత్రంగా ఏర్పాటు చేసుకొని తనను సదరు యువతి మోసగించిందని, ఆర్థికంగా డబ్బు సహాయం అడిగిన సమయంలో తాను కోటి 20 లక్షల వరకు అందించినట్లు తెలిపాడు. అయితే పదేపదే డబ్బులు అడిగిన సందర్భంలో యువతి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఏకంగా మత్తు గులిగలు మింగి అన్నంత పని చేసింది. దీనితో కుటుంబ సభ్యులు అప్రమత్తమై వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఓ వైపు తనకు న్యాయం చేయాలని యువకుడు, మరోవైపు ప్రాణాప్రాయ స్థితిలో ఆ యువతి ఉండగా, పెద్దలు మరోమారు ఈ విషయంలో జోక్యం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×