Cheteshwar Pujara: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 ( Border-Gavaskar Trophy 2024)సమయం లేదు. నవంబర్ 22వ తేదీ దగ్గర పడుతుండడంతో ఆస్ట్రేలియాలో టీమిండియా మంచి జోరు కనబరుస్తోంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ( IND vs AUS Test Series )నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత అభిమానులు సంతోషపడే వార్త ఒకటి బయటకు వచ్చింది.
Also Read: IND vs AUS 1st Test: ఉదయం 7.50 గంటల నుంచే మ్యాచ్..స్ట్రీమింగ్ ఎక్కడంటే !
Also Read: Indian players – BGT: ఆస్ట్రేలియాతో మ్యాచ్… బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ప్లేయర్స్ ?
టీమిండియాలో టెస్ట్ పిల్లర్ గా భావించే ఛతేశ్వర పూజార ( Cheteshwar Pujara ) ఈ సిరీస్ లో భాగమయ్యాడు. అయితే ఈసారి మైదానంలో బ్యాట్ తో కాకుండా మరో పాత్రలో కనిపించవున్నాడు. గత రెండుసార్లు స్వదేశంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంలో పూజార కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి సమయంలో మరోసారి టీమిండియా ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ ఆడాల్సి రావడంతో అభిమానులు పూజారాను ( Cheteshwar Pujara ) చాలా మిస్ అవుతున్నారు.
Also Read: RCB New Bowling Coach: RCBకి కొత్త బౌలింగ్ కోచ్…ఇప్పటివరకు ఒకే ఒక్క వికెట్ తీసాడు ?
అయితే జట్టులో భాగం కానున్న బోర్డర్-గస్కర్ సిరీస్లో స్టార్ స్పోర్ట్స్ తరఫున పూజార ( Cheteshwar Pujara ) కామెంట్రీ చేయనున్నాడు. చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. అతను 2023 ప్రారంభంలో ఆస్ట్రేలియాతో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత డ్రాప్ అయ్యి ఇప్పటివరకు తిరిగి జట్టులోకి రాలేదు. పూజార ఆస్ట్రేలియాలో 11 మ్యాచ్లు ఆడాడు. పూజార అందులో 47.29 సగటుతో 993 పరుగులు చేశాడు.
Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ సంచలన నిర్ణయం..జట్టు కోసం రంగంలోకి వహాబ్ రియాజ్ !
అయితే పూజారా ( Cheteshwar Pujara ) అంతర్జాతీయ క్రికెట్ జట్టులో యాక్టివ్ గా లేకపోవచ్చు కానీ ప్రొఫెషనల్ క్రికెట్ ను వదలలేదు. ఏదో ఒక స్వదేశీ టోర్నీలో ఆడుతూనే ఉన్నారు. ఒక్కోసారి కౌంటిలో ప్రతిభను కనబరుస్తూ కొన్నిసార్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల రంజి ట్రోఫీ సందర్భంగా చత్తీస్గడ్ పై టెస్ట్ సిరీస్ గడ్డపై 234 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్ ఆడవా ? – రోహిత్ పై గంగూలీ సీరియస్ !
దీంతో పూజార ( Cheteshwar Pujara ) మరోసారి భారత జట్టుకు తిరిగి వస్తాడని తెలిసి అభిమానులు అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. పూజార 103 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 43.60 సగటుతో పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 19 సెంచరీలు, 35 అర్థ సెంచరీలు చేశాడు.