Dak Sewa App: వినియోగదారులకు పోస్టల్ సేవలను మరింత చేరువ చేసేందుకు పోస్టల్ శాఖ సరికొత్త యాప్ లాంచ్ చేసింది. ‘డాక్ సేవా యాప్’ ద్వారా వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ నుండి నేరుగా పోస్టల్ సేవలను యాక్సెస్ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని పోస్టల్ శాఖ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఈ యాప్‌ను “మీ పాకెట్‌లో మీ పోస్ట్ ఆఫీస్” అని పోస్టల్ శాఖ పేర్కొంది. డాక్ సేవా యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా పోస్టల్ సేవలను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. ఈ యాప్‌లో పార్శిల్ ట్రాకింగ్, పోస్టేజ్ లెక్కింపు, ఫిర్యాదు నమోదు, బీమా ప్రీమియం చెల్లింపులు వంటి పోస్టల్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
Step 1: యాప్ స్టోర్ లో “డాక్ సేవా యాప్” కోసం సెర్చ్ చేయండి. డాక్ సేవా యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.
Step 2: నకిలీ వెర్షన్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఇండియా పోస్ట్స్ అధికారిక యాప్‌ను ధృవీకరించింది.
Step 3: డాక్ సేవా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని ‘ఇన్‌స్టాల్’ బటన్‌పై క్లిక్ చేయండి.
Step 4: యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోండి. OTPతో ధ్రువీకరించండి. లాగిన్ అయిన పోస్టల్ సేవలను సెర్చ్ చేయవచ్చు.
Also Read: Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..