BigTV English
Advertisement

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఆత్మలు, అతీత శక్తుల నేపథ్యంలో వస్తున్న సినిమాలను ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఆడియన్స్ ని భయపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా సీను సీనుకి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ సినిమా సస్పెన్స్ తోనే సగం చంపేస్తుంది. ఇక ఆత్మల ఎంట్రీతో పై ప్రాణాలు పైకే పోతాయి. హారర్ అభిమానులకు ఈ మూవీ బెస్ట్ సజెషన్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

“ది బానిష్డ్” (The Banished) 2025లో విడుదలైన హారర్ చిత్రం. జోసెఫ్ సిమ్స్-డెన్నెట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మెగ్ క్లార్క్, లీటన్ కార్డినో, గౌటియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), యాపిల్ టీవీ (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

గ్రేస్ ఒక నగరంలో తన అన్న డేవిడ్ తో కలసి ఉంటుంది. ఆమె బాల్యం భయంకరంగా గడిచింది. తండ్రి ఆమెను, ఆమె అన్న డేవిడ్‌ను బాగా హింసించేవాడు. ఆ తల్లిదండ్రులు ఇప్పుడు చనిపోయారు. ఒక రోజు డేవిడ్ ఆస్ట్రేలియా అడవిలో హైకింగ్‌కు వెళ్లి అదృశ్యమవుతాడు. ఈ కేసులో పోలీసులు కూడా ఏమీ తేల్చలేక పోతారు. గ్రేస్ భయపడుతూ డేవిడ్‌ను వెతకడానికి అడవిలోకి వెళ్తుంది. ఆమెకు ఫ్లాష్‌బ్యాక్స్ గుర్తుకు వస్తాయి. తండ్రి చిన్నప్పుడు ఆమెను బంధించి, నీలో దుష్ట శక్తి ఉందని చెప్పేవాడు. అడవిలో ఆమె ఒక పాత ఇంటిని కనుగొంటుంది. అది ఆమె బాల్యంలోని ఇల్లు లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి కథ భయంకరంగా మొదలవుతుంది.


Read Also : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

ఆ అడవిలో గ్రేస్‌కు ఒక స్థానిక గుంపు కనిపిస్తుంది. గ్రేస్ అక్కడ డేవిడ్ బ్యాగ్, రక్తం మరకలు కనుగొంటుంది. గ్రేస్ కు డేవిడ్ డైరీ దొరుకుతుంది. అందులో “తండ్రి ఆత్మ ఇక్కడే ఉంది” అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఆమెకు భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయి. గ్రేస్ ఆ గ్రామస్తులు చేతబడులు చేస్తుంటారని తెలుసుకుంటుంది. వాళ్ళ దగ్గర ఆమె డేవిడ్ శవాన్ని కూడా చూస్తుంది. అతన్ని గ్రామస్తులు దుష్ట శక్తికి బలి ఇచ్చి ఉంటారు. ఇప్పుడు వచ్చే క్లైమాక్స్ మరింత భయంకరంగా ఉంటుంది. గ్రేస్‌ తన తమ్ముడు చావుకి రివేంజ్ తీర్చుకుంటుందా ? గ్రామస్తుల చేతిలో ఆమె కూడా బలి అవుతుందా ? డేవిడ్ ఎందుకు అడవిలోకి వెళ్ళాడు ? అనే విషయాలను , ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

OTT Movie : అమ్మాయిల మధ్య తేడా యవ్వారం… ట్రిప్పు కోసం వెళ్లి సైకో కిల్లర్ల చేతిలో అడ్డంగా బుక్… బ్రూటల్ బ్లడ్ బాత్

OTT Movie : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా

Biker OTT: శర్వానంద్ బైకర్ ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

Big Stories

×