Kalvakuntla Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ఏర్పాటుపై పనులను స్పీడప్ చేసిందా? ఇప్పటి వరకు కవిత ఏం మాట్లాడినా కారు పార్టీలో ఓ అలజడి మొదలయ్యేది. కానీ ఇప్పుడా డోస్ పెంచారు కవిత. ఏకంగా బీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలను టార్గెట్ చేసేలా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు. అంతేకాదు ఇప్పటికే కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో గుబులు పెరిగిందట. ఇంతకీ కవిత పొలిటికల్ స్టెప్స్ ఎటు వైపు? అవి బీఆర్ఎస్‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాటలు ఏవైనా.. చేతలు ఏవైనా అవన్నీ బీఆర్‌ఎస్ టార్గెట్‌గానే ఉంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భం సంచలనంగా మారుతుంది. ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నేతలను వెంటాడుతోంది. ముఖ్యంగా ఈ భయం బీఆర్ఎస్ నేతలకే ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంశాలు, నేతలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయట.
తాజాగా కవిత మరో బాంబు పేల్చింది. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బీఅర్ఎస్ పార్టీలో చాలమంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని.. బీఆర్ఎస్‌ను వీడి జనంబాట పట్టాక అసంతృప్తి నేతలు నాతో టచ్ లోకి వచ్చారంటూ చేసిన కామెంట్స్ కారు పార్టీలో సంచలనంగా మారాయట. కవితతో టచ్‌లో ఆ నేతలు ఎవరు..? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నారు..? ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు? అనేది ఇప్పుడు గులాబీ పార్టీలోనూ చర్చకు తెరలేపాయట.
అంతేకాదు ఎక్కడ చాన్స్ దొరికినా బీఆర్ఎస్ పార్టీకి చురకలు అంటించడమే ఆమె పనిగా పెట్టుకున్నారు. అవినీతి చేశారు, అశ్రద్ధ చేశారు అంటూ విమర్శలు, ఆరోపణలు చేస్తూ స్పీచ్‌లు ఇస్తున్నారు కవిత. అది ప్రాజెక్ట్ అయినా.. రైతాంగ విధానమైనా.. ఇలా టాపిక్ ఏదైనా అందులో బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకోవడం ఇప్పుడు కామన్‌గా మారింది కవితకు.
ఇటీవల కాలంలో బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపైన కవిత స్పందిస్తూనే ఉన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కవిత బయటకు చెబుతున్న పరిస్ధితులున్నాయి. బీఆర్ఎస్ నేతల అసంతృప్తిగా ఉన్నారనే కామెంట్స్ చేయడం వెనక కవిత వ్యూహాం ఏంటి అనేది చర్చినీయంశంగా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యలు చేయడం ద్వారా… బీఆర్ఎస్ పార్టీని డీమోరల్ చేసేందకు మాట్లాడుతున్నారా? లేదా నిజంగానేనా నేతలు టచ్‌లో ఉన్నారా? అనే దానిపై పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ నడుస్తుందట. జనం బాట కార్యక్రమం కోసం జిల్లాల పర్యటనకు వస్తున్న తనకు కారు పార్టీలోని అసంతృప్తి నేతలు టచ్‌లోకి వస్తున్నారని… త్వరలోనే లిస్టు చెబుతానని చెప్పడంతో గులాబీ పార్టీలో కలకలంగా మారుతుందట. కవితకు టచ్‌లోకి వెళ్లిన ఆ నేతలు ఎవరు అనేది ఆరా తీస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట.
కవిత పార్టీని ఏర్పాటు చేయడంపై కూడా ఫోకస్ చేశారు. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలని ముందస్తుగానే బీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల నేతలు సైతం కవితతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేరుగా కలవడం, మరికొందరు ఫోన్ లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలంటే చేంతాడంతా ఉందని, అది సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేస్తున్నారు కవిత. ఇంతకి ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కొంతమంది బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సైతం ఉన్నట్లు ప్రచారం ఊపందుకుందట.
అంతేకాదు కరెంట్ పాలిటిక్స్‌లో తనకంటూ ఓ స్పేస్‌ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు కవిత. దీనికి తగ్గట్టుగానే ఆమె అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని… కొన్ని పార్టీలను నమ్ముకొని దగాపడ్డం అని ప్రజలు తనతో చెబుతున్నారంటున్నారు కవిత. తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమే అని.. ప్రజల గొంతుకగా మారుతామంటున్నారు. అంతేకాదు జాగృతిని పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసే పనిలో కూడా ఉన్నారు కవిత. జాగృతి రాజకీయ వేదికే అని.. తాము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడామని చెబుతున్నారు. తాము ప్రజలకోసమే పోరాడుతామని పదే పదే చెబుతున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తమ ప్రభావాన్ని చూపాలనే ఆలోచన కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని.. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయంటున్నారు కవిత.
తాను ఒంటరి పోరాటం చేస్తున్నాననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత బలంగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తనను వారి బాణం, వీరి బాణం అని అంటున్నారని.. కానీ తాను తెలంగాణ ప్రజల బాణాన్ని అంటూ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. అంతేకాదు తనకు అన్యాయం జరగడం వలన పార్టీనుండి బయటికి రాలేదని.. అవమానం జరిగింది కాబట్టే అత్మగౌరవం కోసం బయటికి వచ్చానని చెప్పడం చూస్తుంటే.. ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్‌తోనే ఆమె ప్రజల్లో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బిజీ బిజీ అయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తన రాజకీయ భవిష్యత్‌పై రోడ్ మ్యాప్‌ను కవిత ప్రకటిస్తారనేది జాగృతి నేతల నుంచి వస్తున్న టాక్.
Story by Vamshi, Big Tv