
Nandita Swetha (Source:Instragram)
శ్వేతా శెట్టి అలియాస్ నందితా శ్వేత.. ప్రముఖ నటిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఎక్కువగా కన్నడ, తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది.

Nandita Swetha (Source:Instragram)
తొలిసారి కన్నడలో వచ్చిన నందా లవ్స్ నందిత సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించిన శ్వేత.. ఆ తర్వాత 2012లో తమిళంలో వచ్చిన అట్టకతి అనే కామెడీ చిత్రంలో నటించింది.

Nandita Swetha (Source:Instragram)
ఆ తర్వాత 2016లో తెలుగులో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి మెప్పించింది.

Nandita Swetha (Source:Instragram)
తెలుగులో చివరిగా మంగళవారం, రాఘవరెడ్డి, ఓఎంజి వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె.. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో అలరిస్తోంది.

Nandita Swetha (Source:Instragram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ ఫ్రాక్ ధరించి ప్రకృతితో పరవశించిపోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Nandita Swetha (Source:Instragram)
ప్రస్తుతం నందిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.