Sitams College: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీతమ్స్ కాలేజిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎగ్జామ్ సమయంలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రుద్ర మూర్తి. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుడు కుటుంబ సభ్యులు కాలేజీ వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే తమ కొడుకు మరణించాడని ఆరోపించారు. రుద్ర మూర్తి కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు అని తెలిపారు. న్యాయం కోసం యాజమాన్యం ప్రశ్నించేందుకు వెళ్లిన మృతుడి బంధువులను సీఐ నిత్యబాబు తోసేశారు. దీంతో ఘటన పై యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కాలేజీ ఎదుట నిరసన తెలిపారు. గత నెల 30న ఇదే కాలేజీలో చదువుకునే ఒ విద్యార్ధిని సూసైడ్ చేసుకోవడంతో.. వారం రోజుల వ్యవధిలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.