వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఇటీవల కర్నూలు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలతో ఆమెను పోలీసులు విచారణకు పిలిపించారు. అయితే ఆ విచారణలో ఆమె తన తప్పేమీ లేదని, పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని అన్నట్టు సమాచారం లీకైంది. దీంతో అంతా పార్టీపైనే నెట్టేసిన శ్యామల అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలతో శ్యామల హర్ట్ అయ్యారు, అలర్ట్ అయ్యారు. వెంటనే మళ్లీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తాను చెప్పిందేంటి, మీడియాలో వచ్చిందేంటి అంటూ చిందులు తొక్కారు. తమతో చెప్పిన విషయాలేవీ బయట మీడియాకు చెప్పొద్దని పోలీసులు తమతో అన్నారని, మరి పోలీసులు మీడియాకు ఎలా లీకులిచ్చారని ప్రశ్నించారు శ్యామల.
తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న fake yellow media కి నా సమాధానం..! లాయర్ల తో మాట్లాడి లీగల్ గా ప్రొసీడ్ అవుతాం 🙏🙏#fakenewsfactory #fakeyellomedia pic.twitter.com/11IJLGOUxG
— Are Syamala (@AreSyamala) November 4, 2025
నేను అలా అనలేదు..
పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని శ్యామల అన్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలతో శ్యామల కాస్త ఇబ్బంది పడ్డారు. తప్పంతా ఆమె వైసీపీపై నెట్టేసినట్టవడంతో పార్టీ నుంచి కూడా ఆమెకు చీవాట్లు పడ్డాయేమో అని అంటున్నారు. దీంతో ఆమె హడావిడిగా సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. తాను అలా అనలేదని అంటూనే, అసలా మేటర్ ని పోలీసులు ఎందుకు లీక్ చేశారని లాజిక్ తీశారు. ఒకవేళ పోలీసులే ఆ సమాచారం లీక్ చేసి ఉంటే, శ్యామల ఆ మాటలు అన్నట్టు ఒప్పుకున్నట్టేనా అనేది తేలాల్సి ఉంది. పోనీ శ్యామల అనని మాటలు మీడియాలో వచ్చి ఉంటే కచ్చితంగా ఆమె వాటిని ఖండించాల్సిందే. ఆ వార్తల్ని ఖండించాల్సింది పోయి, పోలీసుల్ని తప్పుబట్టే సరికి నిజంగానే శ్యామల పార్టీపై తప్పు నెట్టేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!
కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత చాలా పుకార్లు నడిచాయి. వాటిలో ఏది నిజం, ఎంత నిజం అనేది పోలీసులు తేలుస్తారు. మధ్యలో వైసీపీ నేతలు కాస్త ఎక్కువగా స్పందించడంతో అసలు గొడవ మొదలైంది. బస్సు ప్రమాదానికి కారణం అయిన బైకర్ మద్యం తాగాడనేది ప్రధాన ఆరోపణ. దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగి ఆ మద్యం బెల్ట్ షాపులో తాగారని, బెల్ట్ షాపులు లేకపోతే మద్యం వారికి దొరికి ఉండేది కాదని ఆరోపించారు. కానీ పోలీసుల విచారణలో ఆ మద్యం అధికారిక వైన్ షాపులో కొన్నారనే తేలింది. దీంతో అసలు విషయం తెలియకుండా ఆరోపణలు చేసిన వైసీపీ నేతల్ని విచారణకు పిలిపించాల్సి వచ్చింది. పోనీ కర్నూలు లోకల్ నాయకులు అన్నారంటే దానికో అర్థముంది. హైదరాబాద్ లో ఉన్న శ్యామల కర్నూలు ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి బెల్ట్ షాపులోనే మద్యం కొన్నాడంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడం హైలైట్ అయింది. దీంతో ఆమెను పోలీసులు పిలిపించి, అసలా మద్యం సంగతేంటని అడిగారు. బైక్ నడిపిన వ్యక్తి మద్యం ఎక్కడ కొన్నారో మీకెలా తెలుసని ప్రశ్నించారు. దీంతో శ్యామలకు ఏం చెప్పాలో తెలియలేదు. పార్టీ స్క్రిప్ట్ అనే మాట శ్యామల వాడారా లేదా అనేది స్పష్టంగా తెలియదు కానీ.. పార్టీ ప్రస్తావన వచ్చినట్టు మాత్రం తెలుస్తోంది. దీంతో శ్యామలపై కథనాలు వచ్చాయి. ఆ కథనాలపై ఆమె తిరిగి మరో వీడియో రిలీజ్ చేశారు. తప్పుడు కథనాలు రాసిన వారిపై లీగల్ యాక్షన్స్ తీసుకుంటానంటున్నారు శ్యామల.
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్