BigTV English

Keerthy Suresh: ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల..

Keerthy Suresh: నేను శైలజ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్.  మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగు కుర్రాళ్లకు కొత్త క్రష్ గా మారింది.

ఇక మహానటి సినిమాతో.. తెలుగు ప్రేక్షకులు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. మహానటి సావిత్రినే బతికివచ్చిందా అన్నట్లు ఉన్న ఆమె నటనకు జాతీయ అవార్డు నడుచుకుంటూ ఇంటికి వచ్చింది.

ఇక మహానటి తరువాత ఈ చిన్నదాని జాతకం మొత్తం మారిపోయింది. అంతటి హిట్ తరువాత కమర్షియల్ సినిమాలు ఆపేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది.

కానీ, మహానటి తరువాత ఆంతటి హిట్ కీర్తి ఖాతాలో పడలేదు అంటే  ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సర్కారువారి పాట సినిమాలో ఒక మోస్తరు హిట్ ను అయితే సొంతం చేసుకుంది.

ఇక చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. కీర్తి బరువు తగ్గి మరింత అందంగా మారింది. సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో ఈ చిన్నది నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో పాటు.. పండుగలప్పుడు ఎంతో అద్భుతంగా రెడీ అయ్యి కనిపిస్తూ ఉంటుంది కీర్తి సురేష్.

దసరా పండగ సందర్భంగా కీర్తి సురేష్ రోజు చీరకట్టులో ఫోటోలు పెట్టి కుర్రకారు గుండెలను ఫిదా చేసింది. డార్క్ పింక్ చీర.. డిజైనర్ బ్లౌజ్  మీద కొప్పు పెట్టి, దాని చుట్టూ మల్లెలు చుట్టి అచ్చతెలుగు ఆడపడుచులా కీర్తి దర్శనమిచ్చింది.

ఇక ఈ చీరలో కీర్తిని చూసిన అభిమానులు..  కవిత్వాలు, సాంగ్స్ తో పొగిడేస్తున్నారు. ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక కీర్తి కెరీర్ విషయానికొస్తే..  వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆమె సినిమాలు చేస్తుంది. రివాల్వర్ రీటా, బేబీ జాన్ సినిమాలు త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Related News

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Big Stories

×