Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఒక కంటెస్టెంట్ కు బిగ్ బాస్ నాన్ స్టాప్ సపోర్ట్ అందిస్తున్నాడనే ట్రోల్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలిసి తెలిసి బిగ్ బాస్ హౌస్ లో తనూజాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ, ఆమె పట్ల ఆడియన్స్ లో మరింత నెగెటివిటీని పెంచుతున్నారు. శనివారం ఎపిసోడ్ లో ఆ ట్రోల్స్ నిజమే అన్పించేలా మరో సంఘటన చోటు చేసుకుంది.
శనివారం ఎపిసోడ్ లో నాగార్జున హిట్ – ఫ్లాప్ కంటెస్టెంట్లు అంటూ ఆడియన్స్ పోల్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో ఆశ్చర్యకరంగా సుమన్ శెట్టికి 100 శాతం హిట్ ఓటేశారు ఆడియన్స్. ఇమ్మాన్యూయేల్ 95% హిట్ ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక మూడవ స్థానంలో 93 శాతం ఓటింగ్ లో తనూజా ఉంది. ఇమ్మూ ఓటింగ్ రిజల్ట్ రాగానే, 95% అంటే ఆ 5% మరెవరో ఉన్నారు అన్న నాగార్జున… తనూజ ఓటింగ్ చూడగానే ఇక్కడ కూడా తనూజా అంటే నచ్చని వాళ్ళు ఉన్నారు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం విచిత్రంగా అన్పించింది. నిజానికి సీజన్ స్టార్టింగ్ లోనె నాగార్జున తమ ప్రొడక్షన్ అంటూ పరిచయంలోనే తనూజాకు తన స్పెషల్ సపోర్ట్ ఇచ్చేశారు. ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు అనేది ఆడియన్స్ మాట.
ఇక ఈ ఓటింగ్ లిస్ట్ లో టాప్ 6 లో ఉన్నవాళ్లకు స్పెషల్ పవర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఆరుగురి కోసం మరో ఆరుగురి నుంచి వాళ్ళ పర్మిషన్ లేకుండానే త్యాగాన్ని కోరారు. ఈ అవకాశాన్ని రీతూ, ఇమ్మూ మాత్రమే వాడుకున్నారు. మిగతా వాళ్ళు మాత్రం అవతలి వాళ్ళను ముంచే ఆలోచనను విరమించుకున్నారు. ఇక ఈ టాప్ 6లోనే తనూజా – కళ్యాణ్ కూడా ఉన్నారు. తనూజాకు తన సిస్టర్ వాయిస్ మెసేజ్ కావాలంటే కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం నామినేట్ కావలసి ఉంటుందన్నది కండిషన్. కానీ తనూజా దానికి ఒప్పుకోలేదు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి తన కోరిక కోసం నిఖిల్ ను రెండు వారాలు వరుసగా నామినేషన్స్ లో ఉంచడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ లెక్క సరిపోయింది. కానీ నాగ్ మాత్రం మళ్ళీ కళ్యాణ్ దగ్గర తనూజా ప్రస్తావన తీసుకొచ్చాడు. నీ విషయంలో తనూజా ఒప్పుకోలేదు. నీకు నువ్వే నెక్స్ట్ 2 వారాలు డైరెక్ట్ నామినేషన్ లోకి వెళ్తే ఆమెకు ఫ్యామిలీ మెసేజ్ వస్తుందంటూ కళ్యాణ్ ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కళ్యాణ్ ఒప్పుకున్నా తనూజా మాత్రం ఇక్కడ కూడా వెనకడుగు వేసి మంచిపని చేసింది. లేదంటే మరింత నెగెటివిటీని మూటగట్టుకోవాల్సి వచ్చేది ముద్దుబిడ్డ.
Read Also : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్