BigTV English
Advertisement

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : సైకలాజికల్ సస్పెన్స్, ఏలియన్ హారర్ మిక్స్ తో వచ్చిన ఒక సినిమా, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో చిల్లింగ్ థ్రిల్ ని ఫుల్ గా ఇస్తోంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎడింగ్ దాకా చూపు తిప్పుకోకుండా చేస్తోంది. బాక్స్ ఆఫీస్ లో కూడా సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒక బంకర్ లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

’10 Cloverfield Lane’ 2016లో వచ్చిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ దర్శకత్వంలో మేరీ ఎలిజబెత్ (మిచెల్), జాన్ గుడ్‌మన్ (హోవార్డ్), జాన్ గాలగర్ జూనియర్ (ఎమ్మెట్) లీడ్ రోల్స్ లో నటించారు. 103 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమా,
ఐయండిబిలో 7.2/10 రేటింగ్ పొందింది. $15 మిలియన్ల బడ్జెట్ తో బాక్సాఫీస్ వద్ద 110 మిలియన్లను కలెక్ట్ చేసి కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
2016 మార్చి 11న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

మిచెల్ అనే యంగ్ వుమన్ తన బాయ్‌ ఫ్రెండ్‌తో గొడవ పడి కారులో వెళ్తుంటుంది. రోడ్డు మీద ఒక్కసారిగా బ్రైట్ లైట్ కనిపించి భయంకరమైన కారు అక్సిడెంట్ అవుతుంది. మిచెల్ మేలుకున్నాక తను ఒక చీకటి రూమ్‌లో చైన్‌తో గోడకి బంధించి ఉంటుంది. అక్కడికి హోవార్డ్ అనే వ్యక్తి వచ్చి, బయట భయంకరమైన అటాక్ జరిగిందని, నేను నిన్ను కాపాడానని చెప్తాడు. ఏలియన్ అటాక్ తో ఎవరూ బయట బ్రతకలేరని భయపెడతాడు. హోవార్డ్ ఆ అక్సిడెంట్ చూసి లోపలికి తీసుకొచ్చానని ఆమెతో చెప్తాడు. మిచెల్ భయపడి, ఎస్కేప్ ట్రై చేస్తుంది కానీ విఫలమవుతుంది.


Read Also : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

బంకర్‌లో ఎమ్మెట్ అనే మూడో వ్యక్తి కూడా ఉంటాడు. అతడు హోవార్డ్ హెల్ప్‌తో లోపలికి వచ్చానని చెప్తాడు. బయట భయంకరమైన సౌండ్స్, లైట్స్ చూశానని. ముగ్గురూ బంకర్‌లో లాక్ అయిపోతారు. అక్కడ రోజులు గడుస్తాయి, గేమ్స్ ఆడుకుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటారు, కానీ మిచెల్ కి హోవార్డ్ మీద డౌట్ పెరుగుతుంది. స్టోరీ మరింత ఇంటెన్స్ గా నడుస్తుంది. క్లైమాక్స్‌లో భయంకరమైన సీక్రెట్ రివీల్ అవుతుంది. దీంతో ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. హోవార్డ్ సైకో కిడ్నాపరా? బయట ఏమీ జరగలేదా? మిచెల్ ఎస్కేప్ అవుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×