SSMB29 : ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న సినిమా SSMB29. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి ఏదో పెద్దగానే సప్రైజ్ ప్లాన్ చేశాడు. అంతేకాకుండా వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీనిపైన అంచనాలు ఉండటం సహజం. వాటన్నిటినీ రాజమౌళి ఏ స్థాయిలో అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమా గురించి ఇప్పటివరకు సరైన అప్డేట్ అంటూ రాలేదు మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ రానందుకు ఎంతగానో నిరాశపడ్డారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడు నవంబర్లో ఈ సినిమాకి సంబంధించిన ఆ అప్డేట్ ఉంటుంది అని ప్రకటించారు. మహేష్ అభిమానులు అందరూ కూడా కళ్ళు కాయలు కాచేలా దీని కోసం ఎదురు చూశారు. మొత్తానికి నవంబర్ నెల వచ్చేసింది. ఇంకో వారం రోజుల్లో అదిరిపోయే గ్రాండ్ ఈవెంట్ ఈ సినిమాకి సంబంధించి జరగనుంది. దీనిపైన స్వయంగా మహేష్ బాబు మాట్లాడారు.
కొన్ని నెలల నుంచి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసింది. నవంబర్ 15వ తారీఖున మన కథలోని మొదటి అడుగులోకి ప్రారంభిస్తున్నాం. మేమందరం ఏం క్రియేట్ చేసాము అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. జియో హాట్ స్టార్ లో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఎక్స్ క్లూజివ్ గా చూడండి అంటూ మహేష్ బాబు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఇది కేవలం జియో హాట్ స్టార్ కోసం చేసినా కూడా మహేష్ బాబు అభిమానులకు మంచి ఆనందాన్నిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే స్వయంగా తన సినిమా అప్డేట్ ఆయనే ఇచ్చారు.
అసలు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఎటువంటి కథను ప్లాన్ చేశాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. అంతేకాకుండా గతంలో తన సినిమా కథలను ఓపెన్ గా చెప్పేసినట్టు ఈ సినిమా కథ గురించి కూడా జక్కన్న చెప్పేస్తారా అని ఆలోచనలు కూడా చాలా మందికి ఉన్నాయి.
ఒకవేళ ఎస్ఎస్ రాజమౌళి కథను చెప్పేసిన కూడా ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తనను మించిన వారు లేరు. గతంలో కూడా ఈగ, మర్యాద రామన్న వంటి సినిమా కథలను చెప్పేసిన కూడా తాను తీసిన విధానం చాలామందిని ఆకట్టుకుంది ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందేమో వేచి చూడాలి.
Also Read: Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?