Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మానుయేల్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇమ్మానుయేల్ ఆటను ఆడే తీరు క్షుణ్ణంగా గమనిస్తే తన వ్యక్తిత్వం ఏంటో అర్థం అవుతుంది. కొన్ని టాస్కులు బాగానే ఆడుతున్నాడు. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తున్నాడు. కానీ లో లోపల ఎక్కడో ఇన్ సెక్యూర్ ఫీలింగ్ ఇమ్మానుయేల్ కి ఉంది. అలానే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని తాను చేసిన కొన్ని పనులను బట్టి ఈజీగా అర్థమయిపోతుంది.
నామినేషన్ టికెట్స్ తన దగ్గర ఉన్నప్పుడు ఒకటి కూడా ఉంచుకోకుండా ఆరుగురికి అవి పనిచేసి వాళ్ల ద్వారా వేరే వాళ్ళని నామినేషన్ అయ్యేలా చేశాడు. అదే నామినేషన్ ఇమ్మానియేల్ చేస్తే వాళ్లతో ఆర్గ్యుమెంట్ వచ్చి ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ బ్రేక్ అవుతుంది అనే తెలివితోనే ఆ పని చేశాడు ఇమ్మానుయేల్. మరోసారి నేటి ఎపిసోడ్ లో తన సెల్ఫీస్ బిహేవర్ బయట పెట్టాడు.
కొందరు సాగ్రిఫైజెస్ చేస్తే ఇంకొంతమందికి కొన్ని లభిస్తాయి. అయితే ఇమ్మానుయేల్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో హౌస్మెట్స్ అందరితో తన లవ్ స్టోరీ చెప్పి బాగా ఎమోషనల్ అయిపోయాడు. అది చెప్పిన తర్వాతే చాలామందికి ఇమ్ముకి ఒక లవర్ ఉంది అని అర్థమైంది.
అయితే ఇమ్మానుయేల్ కి గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ వాయిస్ మెసేజ్ వినాలి అంటే గౌరవ దగ్గర ఉన్న బ్లెస్సింగ్ పవర్ అనేది పోతుంది. దానికి నువ్వు సిద్ధమేనా అని ఇమ్మానుయేల్ లో నాగార్జున అడిగారు.
అయితే ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా చాలా సేఫ్ గేమ్ ఆడాడు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ నాగార్జునతో మాట్లాడుతూ సర్ దాని గురించి క్లారిటీగా తనకు తెలీదు. అలానే అదెప్పుడు వాడాలో కూడా ఆయనకి క్లారిటీ లేదు. నేనైతే వాయిస్ నోట్ వినాలి అనుకుంటున్నాను అన్ని చెప్పేసాడు. వెంటనే వాయిస్ నోట్ వినిపించారు.
ఆ వాయిస్ నోట్ కూడా ఎక్కువసేపు ఉండదు. గేమ్ చాలా బాగా ఆడుతున్నావ్ మనం తందూరి చాయ్ కోసం తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి మనం ఇంత దూరంగా ఉండటం ఇదే ఫస్ట్ టైం అనేటట్టు ఆ వాయిస్ నోట్ లో ఉంది.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో తెలుగు పూర్తిగా తెలియని కంటెంట్ గౌరవ్. కానీ కొన్ని విషయాల్లో తను నిలబడే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏకంగా కెప్టెన్ కి కూడా ఉన్నది ఉన్నట్లు నేను చేయను అని చెప్పేస్తాడు. అయితే ఇమ్మానుయేల్ ఇలా చేసేసరికి. నేను ఆ పవర్ ని ఉపయోగించుకుందాం అనుకున్నాం కేవలం ఒక వాయిస్ నోట్ కోసం నువ్వు నాకు అన్యాయం చేశావు అని గౌరవ్ ఇమ్మానుయేల్ దగ్గర బాధపడ్డాడు. మరోవైపు కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా పెద్దగా వినలేదు.
Also Read: SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్