Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి తెలియని వారుండరు. ధోని కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగారు విరాట్ కోహ్లీ. అలాంటి ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని, జట్టుకు అనేక విజయాలు అందించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీ, ఇప్పుడు సాధారణ ప్లేయర్ గానే కొనసాగుతున్నారు. టీ20 లతో పాటు టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేలలో మాత్రం కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అయితే, అలాంటి విరాట్ కోహ్లీ ఇటీవలే 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తాజాగా ఆయన పుట్టిన రోజు వేడుకలు కూడా గ్రాండ్ చేసుకున్నారు కోహ్లీ ఫ్యాన్స్. ఈ తరుణంలో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన పని హాట్ టాపిక్ అయింది. ఏకంగా విరాట్ కోహ్లీ ఇంటికే కేక్ ఆర్డర్ చేశాడు సందరు కంటెంట్ క్రియేటర్.
Also Read: Cm Revanth Reddy: హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ స్టేడియం..ఆస్ట్రేలియా తరహాలో బౌన్సీ పిచ్ లు
విరాట్ కోహ్లీ ఇటీవలే 37 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఆయన ఇంటికే కంటెంట్ క్రియేటర్ కేక్ ఆర్డర్ చేశాడు. గురుగ్రామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి కేక్ ఆర్డర్ చేశారు ఓ కంటెంట్ క్రియేటర్. దీంతో విరాట్ కోహ్లీ ఆర్డర్ చేసినట్లుగా ఊహించుకున్న డెలీవరీ బాయ్.. నేరుగా ఆయన ఇంటికి వెళ్లాడు. సెక్యూరిటీ గార్డుకు ఇచ్చాడు. ఇక ఈ తతంగం మొత్తాన్ని కంటెంట్ క్రియేటర్ వీడియో రికార్డ్ చేశారు. ఈ సంఘటన వైరల్ గా మారింది. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ ఇంటి దగ్గర భద్రత సరిగ్గా లేదని ఫైర్ అవుతున్నారు. కేక్ బుక్ చేసినా, చూసే నాథుడే లేడని మండిపడుతున్నారు.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ 11, 2017న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితం కొనసాగింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. తాజాగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరిగింది దీంతో విరాట్ కోహ్లీకి భారీ ఎత్తున అభిమానులు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే విరాట్ కోహ్లీ సతిమణి అనుష్క శర్మ మాత్రం కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేయలేదు. అంతేకాకుండా ఎలాంటి పోస్ట్ షేర్ చేసుకోలేదు.
ప్రతి సంవత్సరం విరాట్ కోహ్లీ పుట్టినరోజున అనుష్క శర్మ స్పెషల్ గా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అనుష్క విషెస్ చెప్పకపోవడంతో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ కారణంతోనే అనుష్క శర్మ విషెస్ చెప్పలేదని కొంతమంది అంటున్నారు. వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ఓ వార్తను తేగ వైరల్ చేస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం చేస్తున్నారు. వీరిద్దరూ అంటే పడనివారే ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.