Big tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమైన ఢీ (Dhee)కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజు(Raju) ఒకరు. ఢీ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఢీ 10 విజేతగా నిలిచారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న ఢీ 20 కార్యక్రమంలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజు బిగ్ టివి కిస్సిక్ టాక్స్ (Big tv Kissik Talks)కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైతన్య మాస్టర్ గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం చైతన్య మాస్టర్ అని తెలిపారు. డాన్స్ పై ఆసక్తితో తాను హైదరాబాద్ కి వచ్చిన సమయంలో చైతన్య మాస్టర్ తనని ఆదుకున్నారని ఆయనే అన్ని అయ్యి నన్ను చూసుకున్నారని తెలిపారు.
ఇలా చైతన్య మాస్టర్ ప్రస్తావన రావడంతో వర్ష ఆయన మరణం పై కూడా రాజుతో మాట్లాడటంతో ఒక్కసారిగా రాజు ఎమోషనల్ అయ్యారు.. చైతన్య మాస్టర్ చనిపోవడానికి రెండు నిమిషాలు ముందు నాకు ఫోన్ చేశారని తెలిపారు. సూసైడ్ చేసుకోవడానికి రెండు నిమిషాల ముందు నాకు ఫోన్ చేయగా నేను మామూలుగానే చేస్తున్నారని కట్ చేశాను. మళ్లీ కూడా ఫోన్ చేయడంతో చాలా డల్ గా మాట్లాడారు . మాస్టర్ చివరిగా నాతో మాట్లాడిన మాట జాగ్రత్త రా… అని చెబుతూ రాజు ఎమోషనల్ అయ్యారు. మాస్టర్ గారు అలా మాట్లాడటంతో మీకు ఏమీ కాదు మాస్టర్ మీ అప్పుల గురించి మీరు బాధపడకండి ముందు మీరు హైదరాబాద్ వచ్చేయమని నేను తనకు చెప్పాను.
నేను మాట్లాడిన మాటలు అన్ని విని సరే అని చెప్పి ఫోన్ పెట్టేశారు. మాస్టర్ ఫోన్ పెట్టేసిన రెండు నిమిషాలకే నా ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చి ఇలా చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్నారని చెప్పగానే నాకు మాటలు రాలేదని ఒక్క క్షణం అది అబద్ధమైతే బాగుండని అనిపించిందని తెలిపారు. మాస్టర్ సూసైడ్ చేసుకోవడంతో మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం నాకు ఫోన్ చేస్తున్నారు నేనేమైపోతానో అని ఆందోళనతో ఫోన్ చేశారని అంత బాండింగ్ మా ఇద్దరి మధ్య ఉండేదని రాజు వెల్లడించారు.
చైతన్య మాస్టర్ మరణించిన తర్వాత ఒక ఏడాది పాటు నేను బయటే కనిపించలేదని ఆ మరణ వార్త నుంచి బయటపడలేకపోయానని రాజు ఎమోషనల్ అవడంతో వెంటనే వర్ష త్వరగా పెళ్లి చేసేసుకో రాజు మీకు చైతన్య మాస్టర్ తిరిగి కొడుకులాగా పుడతారని చెప్పడంతో నేను కూడా అదే అనుకున్నాను. నాకు కొడుకు పుడితే చైతన్య అనే పేరు పెట్టుకుంటాను ఇప్పటికీ నా ఫోన్ లో చైతన్య మాస్టర్ ఫోన్ నెంబర్ సీఎం అని సేవ్ చేసి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఇప్పుడు చైతన్య మాస్టర్ కనుక మీకు కనిపిస్తే నువ్వు ఏం చెప్తావ్ రాజు అంటూ వర్షా అడిగారు. గట్టిగా హాగ్ చేసుకుని మిస్ యు మాస్టర్ అని చెబుతాను అంటూ రాజు చైతన్య మాస్టర్ తో తనకున్న అనుబంధం గురించి ఆయన మరణం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Also Read: Big tv Kissik Talks: జానీ మాస్టర్ అరెస్ట్ .. అలా చేయకుండా ఉండాల్సింది.. ఢీ రాజు కామెంట్స్ వైరల్!