keerthysureshofficial (Source: Instagram)
Keerthy Suresh Latest Photos: హీరోయిన్ కీర్తి సురేష్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. పెళ్లికి ముందు వరకు తమిళ్, హిందీ సినిమాతో బిజీ ఉన్న ఆమె గతేడాది డిసెంబర్లో పెళ్లి పీటలు ఎక్కింది.
keerthysureshofficial (Source: Instagram)
అయితే పెళ్లి తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా ప్రకటించలేదు. దీంతో కీర్తి ఇక సినిమాలకు గుడ్‌బై చెబుతుందా? అని అందరిలో సందేహాలు మొదలయ్యాయి.
keerthysureshofficial (Source: Instagram)
అదే టైంలో తెలుగులో సినిమా ప్రకటించి వాటన్నింటికీ చెక్ పెట్టింది. విజయ్ దేవరకొండ హీరో దిల్ రాజు బ్యానర్లో వస్తున్న రౌడీ జనార్థన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
keerthysureshofficial (Source: Instagram)
ఈ చిత్రంలో తొలిసారి ఈ మహానటి విజయ్‌తో జతకట్టింది. గతంలో కీర్తి నటించిన మహానటిలో విజయ్ కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. దాని తర్వాత వీరిద్దరి లీడ్ రోల్లో వస్తున్న చిత్రమిది.
keerthysureshofficial (Source: Instagram)
దీంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. తెలుగు సినిమా ప్రకటనతో కీర్తి మళ్లీ యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో వరుస అప్డేట్స్ ఇస్తుంది. పెళ్లి తర్వాత నెట్టింట ఆమె సందడి తగ్గిన సంగతి తెలిసిందే.
keerthysureshofficial (Source: Instagram)
చాలా రోజుల తర్వాత కీర్తి తన ఫోటోలు షేర్ చేసింది. మల్టీకలర్ స్కర్ట్ షర్ట్‌లో స్లైలిష్ ఫోజులతో ఆకట్టుకుంది. దీనికి గోల్డెన్ అవర్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.