BigTV English

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్
Advertisement

గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని, ఏపీలో కూడా అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలన్నారు లోకేష్. మోదీకి ఏపీపై చాలా ప్రేమ అని 16 నెలల్లో 4 సార్లు ఏపీకి వచ్చారని, ఏపీ అడిగినవన్నీ చేస్తున్నారని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో నెంబర్-1 కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా అవసరం అన్నారు లోకేష్. గుజరాత్ లో ప్రభుత్వ కొనసాగింపు వల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, మోదీ వరుసగా మూడుసార్లు ప్రధాని కావడం వల్లే ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఎకానమీగా దేసం అభివృద్ధి చెందిందని వివరించారు. సంక్షేమం – అభివృద్ధి అనేవి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల లాంటివని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే ఏపీ అన్ని రంగాల్లో నెంబర్-1 అవుతుందన్నారు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా అని కొనియాడారు లోకేష్. బ్రిటిష్ వాళ్ళను గడగడ లాడించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి, ముత్తుకూరు గౌడప్ప జన్మించిన గొప్ప నేల ఇదని, కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు అని చెప్పారు.


⦿ మోదీకి ఎలివేషన్..
నమో అంటే విక్టరీ అని, ప్రధాని మోదీ ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమేనని అన్నారు నారా లోకేష్. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానిగా నమో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారని, 25 ఏళ్లు అధికారంలో ఉన్నా మొదటి రోజు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ ఆయన అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారని ప్రశంసించారు. గుజరాత్ ని పవర్ ఫుల్ స్టేట్ గా మార్చిన మోదీ, ఇప్పుడు దేశాన్ని సూపర్ పవర్ గా మారుస్తున్నారని చెప్పారు. పహల్గామ్ లో నమో కొట్టిన దెబ్బకి పాకిస్థాన్ దిమ్మ తిరిగిపోయిందని అన్నారు. అమెరికా ట్యాక్సులు పెంచితే పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోయాయని, కానీ నమో ఆత్మనిర్బర్ భారత్ వంటి కార్యక్రమాలతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారని చెప్పారు లోకేష్. నమోకి దేశ ప్రజలంటే నమ్మకం అని, దేశ ప్రజలకు నమో అంటే నమ్మకం అని అన్నారు.

⦿ ఒక్కో కుటుంబానికి రూ.15వేలు మేలు
జీఎస్టీ సంస్కరణలతో దసరా, దీపావళి కలిపి ఒకేసారి వచ్చినట్లుగా ఉందని, ఈ సూపర్ పండుగను 140 కోట్ల ప్రజలకు మోదీ అందించారని చెప్పారు మంత్రి లోకేష్. ట్యాక్స్ తగ్గడం వలన ఒక్కో పేద, మధ్య తరగతి కుటుంబానికి ఏడాదికి 15 వేలు మిగులుతుందన్నారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం… ఇలా పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు పై జీఎస్టీ తగ్గించారన్నారు. పన్నుల తగ్గింపు వల్ల మన రాష్ట్రం రూ. 8 వేల కోట్లు నష్టపోతుందని తెలిసినా సీఎం చంద్రబాబు పర్లేదంటూ ముందడుగు వేశారని, పేద ప్రజలకు 8 వేల కోట్లరూపాయల మేర లాభం జరుగుతుంది కదా అని ఆయన అన్నారని గుర్తు చేశారు.

Also Read: సభలో పవన్ కళ్యాణ్.. గూస్ బంప్స్ స్పీచ్..

⦿ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్..
కేంద్రం లో నమో … రాష్ట్రంలో సీబీఎన్.. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అని అన్నారు లోకేష్. ప్రధాని మోదీ సాయంతో విశాఖ ఉక్కు ను కాపాడుకున్నామని, విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నామని, పోలవరం పనులు వేగవంతం అయ్యాయని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరగడానికి, కర్నూలు లో హై కోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. గూగుల్, స్పేస్ సిటీ , డ్రోన్ సిటీ, కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి కేంద్రం సహకరిస్తోందని, పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అంటే అదేనని వివరించారు.

Also Read: చంద్రబాబు, పవన్ గురించి కర్నూలు సభలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

Related News

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Big Stories

×