RC17 : చిరుత సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ కెరియర్లో మగధీర వంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా అంటే రంగస్థలం అని చెప్పాలి. చిట్టిబాబు అనే పాత్రను రామ్ చరణ్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చరణ్ పుట్టినప్పటినుంచి గోల్డెన్ స్పూన్. అలాంటిది ఒక గ్రామీణ వాతావరణం లో పుట్టి పెరిగిన వ్యక్తి చిట్టిబాబు. ఆ పాత్రను చరణ్ చేయడమే నిజమైన నటుడు అనేదానికి నిదర్శనం.
ముఖ్యంగా చరణ్ ఆ పాత్రలో మాట్లాడే విధానం. చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా సుకుమార్ చరణ్ చూపించిన విధానం మాత్రం వేరే లెవెల్. ఇక ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా అదే ప్రయత్నాన్ని చేస్తున్నారు అనిపిస్తుంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా విడుదలైంది. ఈ సినిమా చరణ్ కెరియర్ లో మరో రంగస్థలం అవుతుంది అని అందరూ ఊహిస్తున్నారు.
రంగస్థలం సినిమా చూస్తే ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. అయితే మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా ఉండబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మే 2026 నుంచి మొదలుకానున్నట్లు తెలుస్తుంది.
పుష్ప సినిమాతో సుకుమార్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. ఇప్పుడు సుకుమార్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. సుకుమార్ సినిమాలు ఫెయిల్ అయిన కూడా దానికో డిగ్నిటీ ఉంటుంది. సినిమాలు ఫెయిల్ అయిన ఒక దర్శకుడుగా సుకుమార్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది.
సుకుమార్ సినిమాలు రంగస్థలం ముందు వరకు ఒకలా ఉండేవి. రంగస్థలం సినిమా తర్వాత కమర్షియల్ సినిమాతో కూడా హై తీసుకురావచ్చు. నేషనల్ అవార్డ్స్ కొట్టొచ్చు. క్యారెక్టర్రైజేషన్ను డిఫరెంట్ గా డిజైన్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు తీసుకురావచ్చు అని నిరూపించిన సినిమా పుష్ప.
అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు ఆ సినిమాకు వచ్చింది అంటే ఆ ఘనత సుకుమార్ కి కూడా కొంతమేరకు ఉంది అని చెప్పాలి. సుకుమార్ సినిమాల్లో రంగస్థలం ముందు వరకు హీరోలు చాలా స్టైలిష్ గా కనిపించే వాళ్ళు. నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో హీరోలు ఎంత అందంగా కనిపిస్తారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రంగస్థలం సినిమా తర్వాత హీరో లుక్స్ లో డిఫరెన్స్ సుకుమార్ తీసుకొచ్చాడు.
Also Read: Neeraja Kona: నీరజ కోనతో నితిన్ మూవీ… కానీ కండిషన్స్ అప్లై