Radhika Apte: రాధిక ఆప్టే(Radhika Apte) సినిమాలు చేసింది చాలా తక్కువే ఆయనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో రక్త చరిత్ర(Raktha Charitra) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అనంతరం లెజెండ్ సినిమాలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇలా పలు తెలుగు సినిమాలలో నటించిన రాధిక ఆప్టే సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె నిత్యము తనకు సంబంధించిన విషయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.
ఇకపోతే తాజాగా సినిమాలో హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ఈమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. ఒకానొక సమయంలో హీరోయిన్ పాత్ర అంటే హీరో పాత్రకు సమానంగానే ఉండేది కానీ ఇటీవల కాలంలో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కోసం మాత్రమే అలాగే హీరోల పక్కన డాన్స్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నారనే విధంగా వారి పాత్రలు ఉంటున్నాయి. ఇటీవల కాలంలో వచ్చే సినిమాలలో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత లేదనేది వాస్తవం. ఇక ఈ విషయం గురించి నటి రాధిక ఆప్టే మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పట్ల చాలా వివక్షత ఉందని తెలిపారు. ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు అంటే ఆ సినిమాలో హీరోని మాత్రమే హైలెట్ చేస్తున్నారని, హీరోయిన్లకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరని తెలిపారు. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కోసం మాత్రమే వారిని ఉపయోగిస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రలను వారికి ఇవ్వటం లేదని రాధిక ఆప్టే తెలియచేశారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ల ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పలువురు ఈమెకు మద్దతు తెలియజేస్తూ ఈమె చెప్పింది వాస్తవమేనని కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమాలకు దూరం..
రాధిక ఆప్టే సినీ కెరియర్ విషయానికి వస్తే…ఈమె మరాఠీ నటి అయినప్పటికీ తెలుగు హిందీ సినిమాలలో నటించారు. తెలుగులో ఈమె రక్త చరిత్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అనంతరం లెజెండ్, ధోని సినిమాలలో నటించారు కథ తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాధిక ఆప్టే ఇటీవల కాలంలో పూర్తిగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె బెనెడిక్ట్ టేలర్ (Benedict Taylor) అనే వ్యక్తిని 2012 వ సంవత్సరంలో వివాహం చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Shilpa Shetty -Raj Kundra: ఆ విషయంలో వెనకడుగు వేసిన శిల్పా శెట్టి..మోసాన్ని ఒప్పుకున్నట్టేనా?