Vijay Devarakonda: ‘రౌడీ‘ హీరో విజయ్ దేవరకొండ సినిమాల లైనప్ చూస్తుంటే మామూలుగా లేదు. లైగర్ తర్వాత కాస్తా డల్ అయిన విజయ్ ఇప్పుడు ఫుల్ జోరు మీద ఉన్నాడు. కెరీర్ని బ్లాక్బస్టర్గా ప్లాన్ చేసుకుంటున్నాడనిపిస్తోంది. కింగ్డమ్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడని అంత అనుకున్నారు. ఈ సినిమా కేవలం టాక్ వరకే పరిమితమైంది. మంచి టాక్ వచ్చినా.. కమర్షియల్గా ఫెయిల్ అయ్యింది. కానీ, లైగర్లా మాత్రం డిజాస్టర్ రాలేదు. దీంతో కింగ్డమ్ విషయంలో ఫ్యాన్స్ హ్యాపీ.
అయితే ఈ సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్‌ని లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్యామ్ సింగరాల్ ఫేం రాహుల్ సంక్రిత్యన్తో ఓ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్పై ఉంది. అప్పుడే రౌడీ జనార్థన్ షూటింగ్ కి కూడా రెడీ అయ్యాయి. దిల్ రాజు బ్యానర్లో రవి కిరణ్ కోల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఇటీవల పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానుంది. విజయ్ ఖాతాలో ఉన్న ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్గా రూపొందుతున్న ఈ సినిమాలపై ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇవి కాకుండ మరో క్రేజీ కాంబోను సెట్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్లో ఉండగానే.. మరో సినిమాను లైన్లో పెట్టాడు. దీనిని కూడా హిట్ డైరెక్టర్.. బిగ్ బ్యానర్లో ప్లాన్ చేసుకున్నాడట. ఇప్పటి వరకు చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. క్రేజీ కాంబో సెట్ అంటూ మురిసిపోతున్నారు. మనం, గ్యాంగ్లీడర్, 24 వంటి సూపర్ హిట్ చిత్రాలతో టాలీవుడ్ ప్రత్యేక మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు విక్రమ్ కే కుమార్. డిఫరేంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ని ఆకట్టుకున్న ఈ డైరెక్టర్కి విజయ్ ఒకే చెప్పాడట. ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్లో ఈ చిత్రం రూపొందనుందని టాక్.
Also Read: Anchor Lasya: యాంకర్ లాస్య కొత్తింటి గృహప్రవేశం.. ఇల్లు చూసి కుళ్లుకున్న నోయెల్!
కాగా విక్రమ్ కే కుమార్ ఇటీవల విజయ్ని కలిసి స్టోరీ లైన్ చెప్పాడట. ఇది వినగానే ఈ రౌడీ ఫుల్ ఎగ్జయిట్ అయ్యాడట. వెంటనే విక్రమ్కి ఒకే చెప్పాడట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడట విక్రమ్. అంత ఒకే అయ్యాక ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. విక్రమ్ కే కుమార్ స్టోరీటెల్లింగ్ స్టైల్ ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ విజయ్ దేవరకొండ ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో కలిస్తే ఏం మ్యాజిక్ జరుగుతుందో అని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. భలే కాంబినేషన్ అని, ఈ సినిమా విజయ్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయట.