Pithapuram Politics: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మ పరోక్షంగా స్పందించారు. నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌నే. తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పని చేసిన నాయకుడిని. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి. వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు. అంటూ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.
వర్మ వ్యాఖ్యలు పిఠాపురం రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. నేను గత 23 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నాను. నేను చేసే ప్రతీ పని మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే. జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆగు వర్మ అంటే ఆగిపోయాను. వర్మ పని చెయ్ అంటే పని చేశాను. నా రాజకీయ జీవితం అంతా పార్టీ పట్ల నిబద్ధతతోనే సాగింది అని ఆయన స్పష్టం చేశారు.
వర్మ మాట్లాడుతూ.. నాకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై ఉన్న విశ్వాసం ఎప్పటికీ మారదు. వాళ్ల నాయకత్వం నాకెప్పుడూ స్ఫూర్తి. మన కూటమి బలంగా ఉండాలంటే మనం మౌనంగా ఉండడం కూడా ఒక విధమైన కర్తవ్యం. నేను ఎవరిపైనా వ్యక్తిగతంగా స్పందించను. పార్టీ పటిష్టతే నా ప్రాధాన్యం అని అన్నారు.
మంత్రి నారాయణ తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడినట్లు.. వచ్చిన వార్తలపై వర్మ క్లారిటీ ఇచ్చారు. నారాయణ వీడియోలో మాట్లాడారా మాట్లాడి ఉంటే వీడియోస్ చూపించమని వర్మ ప్రశ్నించారు. సందర్భాన్ని బట్టి వచ్చిన ఆడియోకిని సమాధానం చెప్పను. వీడియోలో స్పందించి ఉంటే నేను స్పందించడానికి అర్థం ఉండేది అంటూ ఘాటుగా స్పందించారు.
Also Read: ల్యాండ్ మార్క్ డే! 2 రోజుల్లో 258 మంది.. మావోయిస్టుల లొంగుబాటుపై అమిత షా ట్వీట్
తాజాగా నారాయణ వ్యాఖ్యల తర్వాత.. వర్మ పేరు మళ్లీ పిఠాపురం రాజకీయ వేదికపై హాట్ టాపిక్ గా మారింది. మంత్రి నారాయణ, వర్మ మధ్య మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో, కూటమి భవిష్యత్తుపై దాని ప్రభావం ఎలా ఉంటుందో అనేది చూడాలి.