College Incident: నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్ధి క్లాస్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. విద్యార్ధుల సమాచారం ప్రకారం.. క్లాస్ రూమ్‌లో ఓ మహిళ లెక్చరల్ విద్యార్థి ఉదయ్‌ను మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఉదయ్ క్లాస్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన విద్యార్థి కుటుంబ సభ్యులు కాలేజి వద్దకు చేరుకొని రోదిస్తున్నారు. ఏబీవీపీ నాయకులు కాలేజి ఎదుట నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.