rhea_chakraborty (Source: Instagram)
Rhea Chakraborthy Latest Photoshoot: రియా చక్రవర్తి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా సినిమాలతో కంటే హీరో ఆత్మహత్య కేసులో ఈమె పేరు మారుమ్రోగింది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు బాలీవుడ్లో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.
rhea_chakraborty (Source: Instagram)
ఈ కేసులో ఎంతోస్టార్ కిడ్స్, సినీ ప్రముఖులపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అతడి కెరీర్ నాశనం చేసేందుకు బాలీవుడ్ మాఫీయా.. రీయాను వాడుకున్నారంటూ మొదట ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సుశాంత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తి ప్రధాన నింధితురాలు అభియోగాలు ఎదుర్కొంది. నార్కొటిక్ బ్యూరో సైతం రియాను దోషిగా నిర్దారించింది.
rhea_chakraborty (Source: Instagram)
2020 జూన్ 14న సుశాంత్ బాంద్రాలోని తన అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అతడి ఆత్మహత్యకు రియాకు సంబంధం ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. సుశాంత్‌కు ఆమె డ్రగ్స్ అలవాడు చేసిందని, డ్రగ్స్ మాఫియాతో ఆమె సత్సంబంధాలు ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఈ కేసులో ఆమె సోదరుడు కూడా నిందితుడిగా ఉన్నాడు. ఇలా సుశాంత్ సింగ్ మరణంతో ఆమె గత ఐదేళ్లుగా ఈ కేసులో నిందితురాలుగా నిలుస్తూ వస్తుందో.
rhea_chakraborty (Source: Instagram)
అంతేకాదు డ్రగ్స్, హత్య కేసులో కూడా ఆమె జైలుకు వెళ్లి వచ్చింది. ఐదేళ్ల పాటు సాగిన ఈ హత్య కేసులో చివరకు ఆమెను నిర్ధోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసులో రియాకు భారీ ఊరట లభించింది. అంతేకాదు దీంతో సీజ్‌లో ఉన్న ఆమె పాస్ పోర్టు కూడా ఇటీవల వచ్చింది. దీంతో రియా తన జీవితాన్ని రీస్టార్ట్ చేసింది. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
rhea_chakraborty (Source: Instagram)
ఈ క్రమంలో ఫోటోషూట్స్ దర్శక-నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిజైనర్ శారీలో రియా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దేశీ అమ్మాయిలే అంత్యంత సంతోషకరమైన అమ్మాయిలు అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత ట్రెడిషనల్ లుక్ రియా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.