Dude Movie : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. ఇప్పటివరకు ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా ఈ బ్యానర్ లో నిర్మితం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా ప్రస్తుతం ఈ బ్యానర్ లో నిర్మాణ దశలో ఉన్నాయి.
ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు కొత్త దర్శకులు కూడా ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు తో పాటు 8 వసంతాలు లాంటి క్లాసిక్ లవ్ స్టోరీస్ కూడా వస్తుండడం మాట్లాడుకోవాల్సిన విషయం. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈ బ్యానర్ సినిమాలు నిర్మించడం మొదలుపెట్టింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తి స్వరన్ అనే కొత్త దర్శకుడు డ్యూడ్ సినిమాతో పరిచయం అవుతున్నాడు.
దర్శకుడు కీర్తి కు మైత్రి రవి కథ చెప్పడానికి మూడు గంటలకు టైం ఇచ్చారు. అయితే దర్శకుడు మాత్రం పొద్దున్నే 8 గంటలకు హైదరాబాద్ వచ్చేసాడు. మూడు గంటల వరకు ఏం చేయాలో తెలియక జూబ్లీహిల్స్ రోడ్ల పైన తిరుగుతూ ఉన్నాడట. తాను అలా తిరుగుతున్న టైంలో ఎంతో టెన్షన్ కు గురయ్యాడు.
సినిమా కథ ఓకే కాకపోయినా పర్వాలేదు కానీ కనీసం ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇస్తే చాలు అనుకున్నాడట. అయితే కథను చెప్పగానే మొదటి సిట్టింగ్ లోనే నిర్మాత మైత్రి రవిశంకర్ కథను ఓకే చేసేసారట. ఇలా కొత్త దర్శకుడు ను ఎంకరేజ్ చేయడం మామూలు విషయం కాదు. ఒక సెట్టింగ్ లోనే కథను ఓకే చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పారు అని తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడు దర్శకుడు కీర్తి.
మైత్రి మూవీ మేకర్స్ లో సినిమా జరుగుతుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేసే దర్శకులు సినిమాకు సంబంధించిన ఈవెంట్ కి రావడం సహజం. అలా డ్యూడ్ ఈవెంట్ కు హను రాఘవపూడి, బుచ్చిబాబు వంటి దర్శకులు వచ్చారు.
బుచ్చిబాబు మాట్లాడుతూ ఎవరికీ లేని అదృష్టం నాకు దక్కింది. నేను మైత్రి మూవీ మేకర్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. నేను మొదటి సినిమా చేస్తున్నప్పుడు నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు కేవలం ఒక్కసారి మాత్రమే బడ్జెట్ 20 కోట్లు అయింది అని నవీన్ గారి నాతో అన్నారు. అలానే దర్శకుడు కీర్తి గురించి భాషా సినిమాలో రజనీకాంత్ ఎలివేషన్ ఇచ్చినట్టు నాకు రవి గారు కీర్తి గురించి ఎలివేషన్ ఇచ్చారు అని చెప్పాడు.
Also Read: RC17 : రామ్ చరణ్ తో రంగస్థలం సీక్వెల్ సెట్ చేసిన సుకుమార్?