Hathya Film: హత్య (Hathya)ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎన్నో వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా ఇటీవల కాలంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలు కొందరిని కించపరుస్తూ ఉన్నారని వాదనలు వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం కూడా వివాదాలలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే హత్య సినిమా దర్శక నిర్మాతలు కూడా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకులు నిర్మాత రచయితపై సునీల్ కుమార్ యాదవ్(Sunil Kumar Yadav) ఐదు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయటం గమనార్హం.
ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే సినిమా ప్రసారానికి ముందు ఇది ఎవరిని ఉద్దేశించి చేయలేదని, కల్పితం అని చెప్పినప్పటికీ ఈ సినిమా చూస్తే కనుక కచ్చితంగా ఈ సినిమా వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య గురించి తెరకెక్కించారని స్పష్టం అవుతుంది. అయితే ఈ సినిమాలో సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పాత్రను అలాగే తన తల్లిపాత్రను కూడా ఎంతో కించపరిచే విధంగా చూపించినట్టు సునీల్ కుమార్ యాదవ్ గతంలో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఈయన హత్య సినిమా దర్శకుడు నిర్మాత రచయితపై కోర్టులో పరువు నష్టం ధావా వేశారు.
ఈ సినిమాలో తనతో పాటు తన తల్లిని అవమానకరంగా చిత్రీకరించారని ఈయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలతో పాటు వైసిపి ఇన్చార్జ్ పై కూడా పరువు నష్టం దావా వేస్తూ కోర్టు నుంచి నోటీసులను పంపించారు. ఇక ఈ వ్యవహారం వెనుక వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ పవన్(Pawan) అనే వ్యక్తి ఉన్నారని అయితే ఈయన ఎంపీ అవినాష్ రెడ్డి(Y.S.AvinashReddy) ప్రోత్బలంతోనే చేశారంటూ సునీల్ కుమార్ యాదవ్ ఆరోపణలు చేశారు. ఈ సినిమాలో తనను తన తల్లిని ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించారని తన కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని ఈయన నోటీసులలో తెలియజేశారు.
ఇలా తన గురించి చెడుగా ప్రచారం చేయటం వల్ల నా జీవితం వృత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని సునీల్ కుమార్ యాదవ్ తెలియజేశారు. ఇలా సునీల్ కుమార్ యాదవ్ హత్య చిత్ర బృందానికి పరువు నష్టం దావా వేసినప్పటికీ చిత్ర బృందం ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు.. గతంలో కూడా సునీల్ కుమార్ యాదవ్ ఇదే విషయం గురించి కడప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఇక వైయస్ వివేక హత్య కేసు సిబిఐ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కేసు విచారణలో ఉండగానే హత్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అనంతరం ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. మరి సునీల్ కుమార్ యాదవ్ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా హత్య చిత్ర బృందం నుంచి ఏదైనా స్పందన వస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Bahubali The Epic: సెన్సార్ పూర్తి చేసుకున్న బాహుబలి ది ఎపిక్.. రన్ టైం ఎంతంటే?