jaiswalpragya (Source: Instagram)
Pragya Jaiswal Latest Photoshoot: ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి బాలక్రష్ణ అఖండ చిత్రంతో తొలి కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
jaiswalpragya (Source: Instagram)
దీంతో నందమూరి ఫ్యాన్స్ అంత ఈ భామను బాలయ్య హీరోయిన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. అఖండ, డాకు మహారాజ్ చిత్రాలతో బాలయ్య సరసన జతకట్టింది. నిజానికి టాలీవుడ్ ఈ భామ ఎప్పుడో అడుగుపెట్టింది.
jaiswalpragya (Source: Instagram)
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఇందులో ప్రగ్యా గ్లామర్ లుక్, అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
jaiswalpragya (Source: Instagram)
ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ సరసన కంచెలో జతకట్టింది. ఇందులో ప్రగ్యా అందం, అమాకత్వంతో కుర్రకారు ఆకట్టుకుంది. ఆ తర్వాత నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి చిత్రాల్లో భాగమైంది.
jaiswalpragya (Source: Instagram)
ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన తెలుగులో ఆమెకు ఆశించిన గుర్తింపు రాలేదు. కానీ, బాలయ్యతో చేసి అఖండ, డాకు మహారాజు వంటి చిత్రాలు ఆమె స్టార్ హీరోయిన్ గుర్తింపు ఇచ్చాయి.
jaiswalpragya (Source: Instagram)
దీంతో ఆమె తెలుగులో బాలయ్య హీరోయిన్గా ముద్ర వేసుకుంది. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
jaiswalpragya (Source: Instagram)
గ్లామర్స్, బికిని లుక్ షేర్ చేస్తూ నెటిజన్స్‌ని ఫిదా చేస్తుంది. తాజాగా ఈ భామ డిజైనర్ శారీలో హోయలు పోయింది. రోజ్ గోల్డ్ చీరలో ప్రగ్యా తన హాట్ అందాల షో చేసింది.
jaiswalpragya (Source: Instagram)
ఆమె ఘాటు ఫోజులు చూసి కుర్రాళ్లంత అబ్బా ప్రగ్యా.. గుండెల్లో పిండేస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.