దీపావళి, ఛత్ పూజ లాంటి పెద్ద పండుగలు వస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణీకులు ఆహ్లాదకరంగా ప్రయాణించేలా కీలక చర్యలు తీసుకుంటుంది. రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న వేళ ఈజీగా క్రౌడ్ కంట్రోల్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పలు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణీకుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లలో రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు.
దీపావళి, ఛత్ పూజ పండుగల కారణంగా రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. భారీ దృష్టిలో ఉంచుకుని, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 28 వరకు కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు నార్త్ రైల్వే వెల్లడించింది. ముఖ్యంగా న్యూఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారమ్ టికెట్లను 13 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
పండుగ సీజన్ లో ప్రయాణీకుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్లాట్ ఫారమ్ టికెట్ల అమ్మకాల నిలివేత నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. “సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, నిరక్షరాస్యులు, మహిళా ప్రయాణీకులతో పాటు వచ్చే వ్యక్తులు ప్లాట్ ఫామ్ టికెట్ కోసం విచారణ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు” అని ఉపాధ్యాయ్ వివరించారు.
Read Also: రైల్వే ప్లాట్ ఫారమ్ మీద గర్భిణీకి ప్రసవం చేసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్!
పండుగ సీజన్ లో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దసరా, దీపావళి, ఛత్ పూజ సందర్భంగా 12 వేల రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా బీహార్, యూపీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా రైళ్లను నడుపుతుంది. దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. రద్దీకి అనుగుణంగా బెర్తుల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: ఇండియన్ డైమండ్ క్రాసింగ్.. నాలుగు రైల్వే లైన్లు ఒకే చోట కలిసే ఈ అద్భుతం గురించి మీకు తెలుసా?