Raghu Dixit : పెళ్లి అంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు, పావు లీటర్ పాలు కాదు జీవితాంతం ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం. అయితే చాలామంది పెళ్లికి వేరువేరు నిర్వచనాలు ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం ఢిల్లీ అనేది తోడు కోసమే చేసుకుంటారు. కొంతమంది తమ ప్రేమను సఫలం చేయడానికి ఏడుగురు వేస్తారు. ప్రముఖ సింగర్ రఘు దీక్షిత్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నాడు.
రఘు దీక్షిత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోలకు సైతం ఈయన గాత్రాన్ని అందించారు. రఘు దీక్షిత్ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి ఎన్నో సినిమాలలో రఘు దీక్షిత్ పాటలు పాడారు.
సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజ శ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతున్నారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ మొత్తానికి వివాహానికి దారితీసింది.
రఘు దీక్షిత్ కు 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరిగింది. 14 సంవత్సరాల ప్రయాణం తర్వాత వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు దీక్షిత్ కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం కూడా అందించారు.
ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఏజ్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిని కూడా చాలా కామన్ గా తీసుకున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అన్నట్లుగానే అందరూ పెళ్ళిళ్ళు తీసుకుంటున్నారు. తమిళ నటుడు ఆర్య, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ వంటి హీరోల పెళ్లిళ్ల విషయంలో కూడా ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది.
Also Read: Dude Movie : డ్యూడ్ కోసం డైరెక్టర్ కన్నీటి కథ… జూబ్లీహిల్స్ రోడ్లమీద పడిగాపులు