Road Incident: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడొద్దని ఎన్ని సార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా కొందరు అస్సలు వినరు. చివరికి ప్రాణాల మీదకే తెచ్చుకుంటారు. అందుకు ఈ ఘటన ఉదాహరణ. ఓ వ్యక్తి ఫోన్ చూస్తూ బైక్ మీద వెళ్తున్నాడు. అదే దారిలో వస్తున్న ప్రొక్లయినర్.. రోడ్డు పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్లేందుకు టర్న్ తిరిగింది. అది గమనించని బైకర్.. నేరుగా వెళ్లి ప్రొక్లయినర్‌ను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. బాధితుడు బేగంపేట్ ఎక్స్ రోడ్‌కు చెందిన మాటేటి రవీందర్ అని తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.