Kiara Advani: తక్కువ సమయంలో హీరోయిన్ కియరా అద్వానీ గ్లామర్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది.

స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

సైలెంట్‌గా లాస్ట్ ఇయర్ రాజస్థాన్‌లో మ్యారేజ్ చేసింది. ఇక కియరా అద్వానీ పనైపోయిందని చాలా మంది భావించారు.

తాను మాత్రం గ్లామర్ ఇండస్ట్రీకి ఏ మాత్రం దూరం కాలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

నార్మల్‌గా మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గిస్తారు హీరోయిన్లు. కానీ, దేని పని దానితే అంటోంది కియరా అద్వానీ (Kiara Advani).

గతేడాది కేవలం ఒక్క ప్రాజెక్టుతో సరిపెట్టుకున్న ముంబై బ్యూటీ, చెర్రీతో గేమ్ చేంజర్ మూవీ చేస్తోంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేవలం బాలీవుడ్‌కి పరిమితం కాకుండా.. అటు టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

తొలిసారి కన్నడ ఫిల్మ్ చేస్తోంది. వచ్చే ఏడాది ఆ చిత్రం విడుదల కానుంది.

అన్నట్లు సుందరీమణులు ఎన్ని సినిమాలు చేసినా, నిత్యం అభిమానులతో మాత్రం టచ్ లో ఉంటారు.

అందుకే వాళ్లని అలరించేందుకు వివిధ బ్రాండ్లకు చెందిన ఫోటోషూట్లను అభిమానులతో షేర్ చేసుకుంటారు.

కియరా అద్వానీ కూడా అలాంటి ఫోటోషూట్ చేసింది. దానిపై ఓ లుక్కేద్దాం.