Hyderabad Crime: కుటుంబాల కలహాలు ఈ మధ్య చాలా ఫ్యామిలీలను చిన్నాభిన్నం చేస్తున్నారు. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చిన్నపిల్లలు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగు చూసింది.
ఆ కుటుంబంలో ఫ్యామిలీ సమస్యలు
పాతబస్తీలోని నివాసం ఉంటున్నారు పృథ్విలాల్ దంపతులు. అతడు వ్యాపారం చేస్తున్నాడు. ఆయన భార్య కీర్తిక అగర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. అయితే దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. అవి చివరకు తీవ్రరూపం దాల్చాయి.
ఫలితంగా ప్రతీ రోజూ భార్యాభర్యల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. ఈ క్రమంలో భర్తకు దూరంగా ఏడాదికి పైగానే బహదూర్‌పురలో తల్లిదండ్రుల వద్దకు వచ్చింది కీర్తిక. కొద్దిరోజుల తర్వాత కూతురు ఇంట్లో ఉండడంతో బంధువులు-ఇరుగుపొరుగు రకరకాల మాటల నేపథ్యంలో కీర్తిక జీవితంపై విరక్తి కలిగింది.
హుస్సేన్‌సాగర్‌లోకి దూకిన తల్లీకూతురు
మ్యారేజ్ చేసుకుని తాను ఇబ్బందులు పడుతున్నానని, ఆ ప్రభావం రెండేళ్ల కూతురిపై పడుతుందని భావించింది. దీంతో చనిపోవాలని డిసైడ్ అయ్యింది కీర్తిక. అనుకున్నట్లుగానే నవంబర్ రెండున ఆదివారం కూతురితో కలిసి హుస్సేన్ సాగర్‌కు వచ దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
సోమవారం నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ మృతదేహానికి సమీపంలో చిన్నారి మృతదేహం కనిపించింది. వివరాలు తెలియకపోవడంతో వారి మృతదేహాలను మార్చురీకి తరలించారు పోలీసులు.
ALSO READ: హైదరాబాద్ మెట్రోలో దారుణం.. వృద్దుడిపై దాడి చేసి తోసేశారు
అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల నుండి CCTV ఫుటేజ్‌లను పరిశీలించారు. ప్రమాదమా? లేదా ఆత్మహత్యా ? మరేదైనా కారణమా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బహుదూర్పురాలోని కీర్తిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమ కూతురు, మనుమరాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. రెండు రోజుల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మహిళ కీర్తిక అగర్వాల్‌గా గుర్తించి, చివరకు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. వారొచ్చి కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. తల్లిదండ్రులకు కూతురు-మనమరాలి మృతదేహాలను అప్పగించారు పోలీసులు.