BigTV English
Advertisement

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Nara Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025  పురస్కారం అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌-IOD సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేశారు. ఆ వేదికపై గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును అందుకున్నారు.


డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం ప్రధానం

మంగళవారం రాత్రి లండన్ వేదికగా డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం ప్రధాన కార్యక్రమం వైభవంగా జరిగింది. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు-భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సంస్థ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని భువనేశ్వరికి అందజేశారు.


ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ హోదాలో రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమె. విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల్లో సహాయం తదితర అంశాల్లో సేవలందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన వంటివి అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు.

లండన్ వేదికగా అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

ముఖ్యంగా తలసేమియా రోగులకు ఉచితంగా రక్త మార్పిడి, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.   ఈ నేపథ్యంలో ప్రజాసేవ-సామాజిక సాధికారత రంగాల్లో చేసిన కృషికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం అందజేస్తున్నారు IOD సంస్థ.

దీనికితోడు హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగంలో గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు వరించింది. ఆ సంస్థ వీసీఎండీ భువనేశ్వరికి ఆ వేదికపై అవార్డును అందుకున్నారు. డెయిరీ బ్రాండ్‌గా హెరిటేజ్‌ను తీర్చిదిద్దడం, ఆ సంస్థ ఎదుగుదలతోపాటు కోట్లాది మంది వినియోగదారులకు ఆ ఉత్పత్తులు చేరువయ్యేలా చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.

ALSO READ: కార్తీక పౌర్ణమి సందర్భంగా కిటకిటలాడిన దేవాలయాలు

ఈ సంస్థ కార్యకలాపాల ద్వారా రైతుల సాధికారతకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా సీఎ చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. లండన్‌ వేదికగా రెండు ప్రతిష్టాత్మక అవార్డులు సతీమణి భువనేశ్వరి అందుకోవడం పట్ల తాను చాలా గర్వపడుతున్నానని రాసుకొచ్చారు. తొలుత IOD డిస్టింగుష్డ్ ఫెలోషిప్‌-2025 పురస్కారం ప్రజా సేవ, వ్యాపార నాయకత్వం చేసిన విశేష కృషిని గుర్తిస్తుందని రాసుకొచ్చారు.

హెరిటేజ్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్-2025 విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డు ప్రదానం చేసినట్టు రాసుకొచ్చారు. NTR ట్రస్ట్- హెరిటేజ్ టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తల్లి అవార్డు తీసుకోవడంపై మంత్రి లోకేష్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఇవాళ తాను చాలా సంతోషంగా గర్వ పడుతున్నట్లు రాసుకొచ్చారు. తల్లి భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డును ప్రపంచ వేదికపై సత్కరించడం చాలా చాలా ఆనందంగా ఉందన్నారు.

 

Related News

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×