OTT Movie : ఎన్నో జీవితాలు, మరెన్నో ప్రేమ కథలు. ప్రతీ ప్రేమ కథలో కన్నీటి కలవరింతలు. నిజమైన ప్రేమ ఏమి కోరుకుంటుందో ఆ ప్రేమించే హృదయానికే తెలుస్తుంది. ప్రేమ రుచిని చూపించే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ ప్రేమ కథ నిజంగానే అద్భుతంగా ఉంటుంది. ఈ కథ ఒక నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొందింది. పక్షవాతంతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన జీవితాన్ని చాలించాలని నిర్ణయించుకుని, స్విట్జర్లాండ్‌లోని అసిస్టెడ్ సూసైడ్ సెంటర్‌కు వెళ్లిన వార్తా కథనం ద్వారా రచయిత్రి మోయెస్ ప్రభావితమయ్యారు. ఆమె రాసిన నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
“మీ బిఫోర్ యూ” (Me Before You) అనే ఈ రొమాంటిక్ డ్రామా థియా షారోక్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మిలియా క్లార్క్, సామ్ క్లాఫ్లిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 జూన్ 3న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video), గూగుల్ ప్లే మూవీస్ లో అందుబాటులో ఉంది.
ఇంగ్లండ్‌లోని చిన్న పట్టణంలో లూయిసా క్లార్క్ అనే అమ్మాయి ఉంటుంది. తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఉద్యోగాలు మారుతూ ఉంటుంది. ఆమె ఫ్యామిలీ బాగా పూర్. తండ్రికి జాబ్ లేదు, తమ్ముడు స్కూల్ కి వెళ్ళాలి, అమ్మ ఇంటి పని మాత్రమే చూసుకుంటుంది. ఇక భారం మొత్తం లూ మీద పడుతుంది. ప్రస్తుతం కేఫ్‌లో జాబ్ చేస్తుంది. కానీ కేఫ్ కూడా మూసేస్తారు. జాబ్ లేకుండా ఇంటికి వచ్చి బాధపడుతుంది. ఈ సమయంలో ఆమెకు కేర్ టేకర్ జాబ్ వస్తుంది. ఆమె రెండు సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా నడుము కింద పక్షవాతంతో వీల్‌చైర్‌కు పరిమితమైన, ఒక ధనవంతుడు విల్ కి సహాయకురాలిగా పనిలో చేరుతుంది. లూ మొదటి రోజు విల్‌ను చూసి భయపడుతుంది. అతను చాలా రూడ్ గా, ఆమెను టీజ్ చేస్తాడు. కానీ లూ జాబ్ కోసం సహనంగా ఉంటుంది.
Read Also : మిస్సైన కూతురి కోసం వెళ్తే ప్యాంటు తడిచే హర్రర్ సీన్లు… ఇలాంటి హర్రర్ మూవీని ఇప్పటిదాకా చూసుండరు భయ్యా