BigTV English
Advertisement

Horoscope 24 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇలా చేస్తే ఇంకా బెటర్!

Horoscope 24 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇలా చేస్తే ఇంకా బెటర్!

Astrology 24 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది? వంటి వివరాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా పెద్దల సహకారంతో పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సూర్య ఆరాధన శుభకరం.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అభయ ఆంజనేయస్వామిని సందర్శించుకోవాలి.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు శారీరక శ్రమ పెరగవచ్చు. ఆర్థికపరంగా అనుకూలంగానే ఉంటుంది. కుటుంబంలో కలిసిమెలిసి ఉంటారు. ఆదిత్య హృదయం పఠించాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. అన్ని రంగాల వారికి పెట్టిన పెట్టుబడిలో రెట్టింపు లాభాలు వస్తాయి. ఉద్యోగుకుల సమాజంలో హోదా పెరుగుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించాలి.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల ఆటంకాలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో తోటివారి సహకారం అవసరం. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాంలో పూర్తిచేస్తారు. సమాజంలో కీర్తి పత్రిష్టలు పెరుగుతాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన శుభప్రదం.

కన్య:
ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధనలాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశివారికి లక్ష్మీకటాక్షం.కావున ధనప్రవాహం వరిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాస్తోత్రం పఠించాలి.

Also Read: దీపావళి పండుగను హ్యాపీగా జరుపుకోవాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పని సరి!

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు పట్టిందల్లా బంగారమే. మంచి సంపద కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తోటివారితో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మంచిది.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ విపరీతంగా పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో పనిభారానికి లోనవుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివాష్టకం నిత్య పారాయణ చేస్తే మంచిది.

ధనుస్సు:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపార రంగాల్లో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శనిస్తోత్రం పారాయణతో సమస్యలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. సమాజంలో గుర్తింపుతో పాటు హోదా పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు ఉంటాయి. గణపతిని ఆరాధించాలి.

మీనం:
మీన రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. వ్యాపారులకు మాత్రం ధనప్రవాహం ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభసూచికం.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×