BigTV English
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 05వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:  

గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభ రాశి:

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.


మిథున రాశి:  

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు. ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి.  చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల  సహాయం  లభిస్తుంది. ఉద్యోగపరంగా వేధిస్తున్న  సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

కర్కాటక రాశి:

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ది కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహరాశి:

ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

కన్యారాశి :

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు  తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం  బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి ఉద్యోగ  విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల నుండి బయటపడతారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికరాశి:

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు.

ధనస్సు రాశి:

వ్యాపార పరంగా ఇబ్బందులు  తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

మకరరాశి:

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది.  రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

కుంభరాశి:

సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

మీనరాశి:

ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/11/2025) ఆ రాశి ఉద్యోగుల సమస్యలు తీరుతాయి – వారికి ఆర్థికపరమైన నష్టాలు   

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/11/2025) ఆ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 2 – నవంబర్‌ 8)  ఆ రాశి వారికి అదనపు ఆదాయం – వారికి ధనపరమైన ఇబ్బందులు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/11/2025) ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు – వారికి స్తిరాస్థి వివాదాలు పరిష్కారం

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Monthly Horoscope in Telugu: ఈ నెల రాశిఫలాలు: నవంబర్ లో ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (31/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – వారికి బంధువులతో గొడవలు  

Big Stories

×