Gundeninda GudiGantalu Today episode November 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలు ఏదో బాధ పడుతూ కనిపిస్తాడు. అయితే ఏమైందండీ ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది మీనా. షీలా డార్లింగ్ వస్తుంది కదా అందుకే అని అనగానే అమ్మమ్మ వస్తే బాధ ఎందుకు సంతోషమే కదా అని అంటుంది. చిన్నప్పటినుంచి నాకు మా బామ్మ కి పుట్టినరోజుకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకునేది. అయితే అప్పుడు డబ్బులు లేక కుదరలేదు ఇప్పుడు డబ్బులు కుదురుతాయో లేదో అని బాధపడుతూ ఉంటాడు.. ఒక బంగారు చైను కొనిద్దామని నేను అనుకుంటున్నాను నువ్వు ఏమంటావు మీనా అని అంటాడు. అమ్మమ్మకి కొనివ్వడం మంచిదే. నేను కోడలుగా అడుగు పెట్టిన తర్వాత నాకు భయాన్ని పోగొట్టింది అమ్మమ్మ అని మీనా కూడా బాలుకు సపోర్ట్ చేస్తుంది. మనం ఖచ్చితంగా చేపిద్దాం అని అంటుంది. సత్యంను నగల గురించి అడుగుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ప్రభావతి మనోజ్ ఒకేసారి కలిసి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. మీరిద్దరేంటి ఒకేసారి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు అని రోహిణి అందరూ ఒకేసారి అడుగుతారు.. అదేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు ఏదో దొంగల్ని అడిగినట్లు అని ప్రభావతి అంటుంది. దానికి బాలు మీరు దొంగలే కదా అని అంటారు.. రోహిణి ఎక్కడి నుంచి వచ్చారు మనోజ్ అని అడుగుతుంది. నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్లి మాట్లాడేసి వస్తున్నాను.. అమ్మ బయట కనిపించింది. అలా లోపలికి ఇద్దరు ఒకేసారి వచ్చాం అని మనోజ్ అంటాడు.
సరేగాని మీనా నగలు ఎక్కడున్నాయి అని సత్యం అడుగుతాడు. ఎక్కడుంటాయి ఎక్కడ పెట్టామో అక్కడ ఉంటాయని ప్రభావతి అంటుంది. అదే ఎక్కడున్నాయి చెప్పు అని సత్యం అంటాడు. ఎక్కడ పెట్టానో బీరువాలో పెట్టాను కదా అక్కడే ఉంటాయి ఇప్పుడు ఎందుకు అని ప్రభావతి అడుగుతుంది. ఆ నగలను తెచ్చి మీనాకు ఇవ్వు అని సత్యం అంటాడు.. ఆ నగలు నేను వేసుకోను అని విసిరి కొట్టింది కదా ఇప్పుడు ఎందుకు ఆ నగలు అని ప్రభావతి సత్యంని అడుగుతుంది. అవన్నీ నీకు అవసరం లేదు వాళ్ళు అడిగారు ఇవ్వు అని సత్యం అంటాడు.
నువ్వేం రా ఆలోచిస్తున్నావ్ లక్షలు మింగినట్టు నగలను కూడా మింగేసావా ఏంటి అని బాలు అంటాడు. నేనేం వినలేదు అమ్మ పోయింది కదా తీసుకొని వస్తుందిలే అని మనోజ్ అంటాడు. పైకి వెళ్ళిన ప్రభావతి నగలను తీసుకొని కిందకు వస్తుంది.. ఆ నగలు తీసుకోగానే మీనా చెక్ చేసి ఇవేంటి కొత్తగా మెరిసిపోతున్నాయి అని అంటుంది. నువ్వు ఇచ్చిన తర్వాత వాటిని బాగా కడిగి బీరువాలు పెట్టాను అని ప్రభావతి అంటుంది. ఇప్పుడు ఈ నగలను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రభావతి అడగగానే ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం లేదు వచ్చిన తర్వాత చెప్తాము అని పాలు మీనా బయటికి వెళ్లిపోతారు..
బాలు మీనా గోల్డ్ షాప్ కి వెళ్లి అక్కడ నగలను చూస్తారు. నగలం తీసుకుంటున్నప్పుడు ఆ షాప్ లోని వ్యక్తి కాఫీ తీసుకుని వస్తే ఆ కాఫీ ని తాగి అసలు రుచిగా లేదు అని అంటాడు.. అయితే ఆ షాపు ఓనరు కూల్ డ్రింక్స్ తీసుకురా అని అంటాడు. మీనా సెలెక్ట్ చేసిన చైన్ గురించి షాపు ఓనర్ రెండు లక్షలు అవుతుంది అని అంటాడు. మా దగ్గర పాత బంగారం ఉంది ఇది వేసి ఇంకాస్త డబ్బులు వేసుకుంటాము అని అనగానే ఆ షాపు ఓనరు నగలను తీసుకొని వెళ్లి లెక్క కట్టమని ఓ వ్యక్తికి చెప్తాడు. వెంటనే చెక్ చేసిన ఆ వ్యక్తి అవి కలరింగ్ నగలు అని చెప్తాడు..
ఏంటి మీరు దొంగతనాలు చేసే బ్యాచ్ ఆ కలరింగ్ నగలు తీసుకొని వచ్చి నగలు కొంటున్నట్లు బిల్డప్ ఇస్తున్నారా అని అతను అంటాడు.. ఏం మాట్లాడుతున్నావ్ రా ? మీరు లోపలికి తీసుకెళ్లి మా నగలను మార్చేసారేమో అని బాలు గొడవకు దిగుతారు. ఏం పని లేదా మీకు మళ్ళీ కాఫీ బాగోలేదు అది లేదు ఇది లేదని బిల్డప్ ఇచ్చారు. ఇవి గిల్టు నగలు. పోలీసులకు ఫోన్ చేస్తాను వాళ్లే వచ్చి ఈ నగలు వ్యవహారాన్ని బయట తీరుస్తారని షాప్ ఓనర్ అంటాడు. నువ్వేమనగల్ని లోపలికి తీసుకువెళ్లి ఏదో ఒకటి చేసి ఉంటావు.. రమ్మను పోలీసులు వాళ్లే తెలుస్తారు అని అంటాడు.
అప్పుడే అక్కడికి ఆ షాపు ఓనర్ వచ్చి ఏంటమ్మా మీనా ఏమైంది అని అడుగుతాడు.. మేము నగలను తీసుకుని వచ్చామండి ఇక్కడ గిల్టు నగల అని అంటున్నారు. మేము తీసుకొచ్చింది మాత్రం బంగారం అదిలే అవి ఎక్కడ మారయో తెలియట్లేదు బాబాయ్ గారు అని మీనా అంటుంది. మీరు మాకు తెలిసిన వాళ్లే కదా ఆ నగలు ఎక్కడున్నారో తెలుసుకుని మళ్లీ రండి అని ఆ షాప్ ఓనర్ అంటాడు. అక్కడి నుంచి బయటికి వచ్చేసిన బాలు మీనా ఈ నగలు ఎవరు మార్చేసారో తెలుసుకోవాలి అని అనుకుంటారు.. కచ్చితంగా ఆ మనోజ్ గాడి పని అయ్యుంటుంది లక్షల మింగేసినట్టు నగలను కూడా మింగేసి ఉంటాడు అని బాలు అంటాడు.
Also Read : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..
నగలు అత్తయ్య దగ్గర ఉన్నాయి కదా మరి మీ అన్నయ్య ఎలా తీసుకుంటాడు అని నేను అంటుంది. అయితే వాడు మా అమ్మని కూడా మేనేజ్ చేసి ఆ నగలను కొట్టేసి ఉంటాడు అని బాలు ఆవేశంగా ఉంటాడు.. ఈ విషయం గురించి అమ్మమ్మ గారు వచ్చి వెళ్లిన తర్వాత మనం క్లియర్ గా తెలుసుకుందాము.. ఆమె చాలా సంతోషంగా తన 75వ పుట్టినరోజునే జరుపుకోవాలని వస్తున్నారు. ఆమె వెళ్లేంతవరకు మనం ఈ విషయం గురించి మాట్లాడి బాధ పెట్టకూడదు అని నేను అంటుంది.. మనోజ్ ప్రభావతి మాత్రం టెన్షన్ పడుతూ బయట తిరుగుతూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..