BigTV English
Advertisement

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Kaushal Manda : ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సీజన్ 9 ప్రసారం అవుతుంది. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ఉందన్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు.. ఇప్పటికీ ఈ షూ పై ఎంతమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్లు రివ్యూ ఇచ్చారు. బిగ్ బాస్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల రేటింగ్ పడిపోతుంది అంటే సలహాలు కూడా ఇచ్చారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్నర్ కౌశల్ మండ బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


బిగ్ బాస్ చేసిన మిస్టేక్ ఇదే.. 

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కూడా నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. వీటితో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది యాక్టర్ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు.. కౌశల్ ఆర్మీ పేరుతో ఆయన అభిమానులు సపోర్ట్ చేశారు.. అలా బిగ్ బాస్ విన్నర్ అయ్యారు కౌశల్.. ఇక ఆ తర్వాత సీజన్లపై రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. సీజన్ 9 గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేశారు.

ఆ వీడియోలో మాట్లాడుతూ.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ఇలాంటి వీడియో చేయాలంటే కాస్త సరదాగా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 నేను పెద్దగా చూడట్లేదు కానీ.. అప్పుడప్పుడు ప్రోమో లు చూస్తుంటాను. అయితే హౌస్ లోకి ఈసారి కామనర్స్ సెలబ్రిటీలను సమానంగా పంపించారు. ఇది బిగ్ బాస్ చేసిన అతి పెద్ద మిస్టేక్ అని కౌశల్ అంటున్నారు. మామూలు గా సెలబ్రిటీలను హౌస్ లోకి పంపిస్తే వాళ్ల గురించి తెలుసుకోవాలని వాళ్ళు ఎలా ఉంటారు దగ్గరనుంచి చూడాలని బిగ్ బాస్ చూస్తారు. కానీ ఇప్పుడు నాకు తెలిసి హౌస్ లో ఇద్దరు ముగ్గురు మాత్రమే తెలుసు. అందుకే జనాలు ఎక్కువగా ఈ సీజన్ ని చూడట్లేదు టీవీలను ఆఫ్ చేస్తున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు.


కామనర్స్ కే నా సపోర్ట్.. 

ఇక అంతే కాదు ఒక సెలబ్రిటీ అయ్యుండి కౌశల్ నేను సెలబ్రిటీలకు కాకుండా కామనర్స్ కి సపోర్ట్ గా ఉంటాను అని అంటున్నారు. సెలబ్రిటీలు పెద్ద తోపులేం కాదు. మీరు ఫోకస్ పెట్టి గేమ్ ఆడితే కచ్చితంగా సెలబ్రిటీలు గాలికి ఎగిరిపోయినట్లు పోవాల్సిందే.. ఫస్ట్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కచ్చితంగా మీరే విన్నర్స్ అవుతారు అని సలహాలు కూడా ఇచ్చిస్తున్నారు కౌశల్.. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై కామెంట్ చేస్తున్నారు..

బిగ్ బాస్ సీజన్ 9.. 

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం జరుగుతుంది.. తొమ్మిదవ నుంచి వింత టాస్కులతో పాటు బిగ్ బాస్ కొన్ని కండిషన్లు కూడా పెడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.. అయితే ఈ సీజన్ ఇప్పటికే 9 వారాలు దాదాపు పూర్తిచేసుకుంది. పదవ వారం నామినేషన్ పై ఇప్పటినుంచి ఒక ఆసక్తి నెలకొంది.. ఈ కంటెస్టెంట్ బయటకు వెళ్తారా అని జనాలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ తనూజకు, పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి..

?igsh=MXRzYjR3MHUxNmU5Yw==

Related News

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Bigg Boss: మితిమిరిన గొడవలు.. కొట్టుకున్న కంటెస్టెంట్స్, అసలేమైందంటే..

Bigg Boss 9 promo 2: రెబల్ గా సుమన్ శెట్టి.. సూపర్ పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Big Stories

×