Sobhita Akkineni: శోభితా ధూళిపాళ.. ఈ పేరు ఒకప్పుడు తెలుగులో ఎవరికి తెల్సింది లేదు. కానీ, ఇప్పుడు అమ్మడి పేరే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
అక్కినేని నాగ చైతన్యతో శోభితా రిలేషన్ లో ఉంది అని పుకార్లు వచ్చినప్పటి నుంచి ఈ చిన్నదాని పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది.
ఇక డిసెంబర్ 4 న ఇరు వర్గాల అంగీకారంతో నాగ చైతన్యను శోభితా వివాహమాడింది. ఇక ప్రేమించినవాడితో పెళ్లి జరగడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు అంటే అతిశయోక్తి కాదు.
ఇక పెళ్లి తరువాత చై- శోభితా ముంబైకు పయనమయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె పెళ్ళిలో ఈ జంట సందడి చేశారు.
ఇక ఆ పెళ్లిలో శోభితా డ్రెసింగ్ హైలైట్ గా నిలిచింది. ఎక్కడ గ్లామర్ ను ఒలకబోయకుండా ఎంతో పద్దతిగా కనిపించింది.
నూతన వధువు ఎలా ఉండాలో అలానే శోభితా కనిపించింది. రాయల్ గా కనిపించడానికి ఆమె మెరిసే సల్వార్ సూట్‌లో హైదరాబాదీ ఖడా దుపట్టాతో కూడిన కస్టమ్ కుర్తా.. దానికి కాంట్రాస్ట్ చుడీదార్ ను జతచేసింది. ఇక డ్రెస్ కు ఆమె పెట్టుకున్న ఆభరణాలు మరింత అందాన్ని తెచ్చాయి.
ముఖ్యంగా ఆమె రాయల్ లుక్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కొత్త పెళ్లికూతురు ఈ మాత్రం కనిపించకపోతే బాగోదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.